ఇది వాడితే 60 యేండ్ల వయసు వచ్చిన ముడతలు రావు.

ఎవరికైనా మొహం ముడతలు పడటం, మొటిమలు, మచ్చలు రావడం అంటే అసల్లు నచ్చదు, ఎందుకంటే శరీరంలో మనల్ని అందంగా చూపించేది మొహం ఒక్కటే. అందుకే మార్కెట్లో చర్మ సౌందర్యం కంటే, ఎక్కువుగా మొఖ సౌందర్యం కోసం ఎన్నో రకాల క్రీంలు, మందులు, అవసరమైతే సర్జరీ లు కూడా పుట్టుకొచ్చాయి. ఇదంతా కూడా ఆధునిక కాలంలో వచ్చిన మార్పులు అదే ఒక 50 ఏండ్ల కిందట ఇలాంటివి ఏవి లేకపోయినా స్త్రీలు అందంగా కనిపించే వారు అందుకు మనం మన భారతీయ జ్ఞానసంపద అయిన ఆయుర్వేదానికి కృతజ్ఞతలు తెల్పుకోవలి. ఆయుర్వేదం శరీరానికి హని చేయక సమస్యతో పోరాడుతుంది. ఆయుర్వేదాని పాటించే వారిలో రోగాన్ని నయం చేసి, సమకాలం లోనే దేహంలో కొత్త శక్తిని పుంజుకుంటారు. ఇలాంటి శక్తి ఏ ఇతర మందులలో కనిపించదు. అందుకే మన పూర్వీకులు బహుకాల వృద్ధులైన శక్తి కలిగి జీవించారు.అలాంటి ఆయుర్వేదం నేటికీ కూడా కాచ్చితంగా మేలు చేస్తుంది, ఆయుర్వేదం లో ఒక వ్యాధి ఔషధం గురించి వైద్యము పొందుపరిచారు అంటే ఆ వైద్యం శరీరంలో ఇతర వ్యాధి పైన కూడా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు కడుపులోని సమస్యకు ఉపయోగించే మూలికలు కొన్ని చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడతాయి అవి వాడిన వ్యక్తికి రెండు రకాల లాభాలు కలుగుతాయి.

ఇక ఆయుర్వేదం ఆధునిక టెక్నాలజీ కి ఎంత మాత్రం తీసిపోని రీతిలో ప్రభావం చూపుతుంది, అందుకే అనేక చర్మ సౌందర్య పద్ధతులకు నేటికి కూడా ఆయుర్వేద పద్ధతులనే సూచిస్తారు. వాటి ద్వారా ప్రజలు వందకు వంద రెట్లు పూర్తి సంతృప్తితో ఉంటున్నారు, ముఖ సౌందర్యం కోసం ఆయుర్వేదం తప్ప వేరే ప్రత్యామ్న్యాయం నేటికీ ఇంకా పుట్టుకు రాలేదు, అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి చర్మంపై మేలు కలిగించే కోణంలో పనిచేస్తూ ఉంటుంది.ఇక మన ఆయుర్వేదం లో చర్మ సౌందర్యం గురించి వివరించబడిన వట్టివేరు చర్మానికి సంబంధించిన ప్రతి వ్యాధితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వట్టివేరు సాధారణంగా ప్రతి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది లేదా కొన్ని సూపర్ మార్కెట్లో కూడా దీనిని పొందవచ్చు. చర్మ సౌందర్యాని పెంపొందించేందుకు ఈ విధంగా ప్రయత్నం చేయండి ముందుగా వట్టివేరు ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో పొడి కొట్టుకోండి అదే పొడిలో గంధకచ్చూరాలు వేసి నూరుకోవాలి ఇక అదే మిక్సీలు గులాబీ రేకులు వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇక పొడి చేసుకున్న ఈ పదార్థాలన్నింటిని ఎండిన నారింజ తొక్క పొడి తో కలుపుకొవాలి, ఇదే పొడిలో ఒక స్పూన్ కస్తూరి పసుపు రెండు స్పూన్ల తంగేడు పూల పొడి వేసుకొని నిలువ ఉంచుకోవాలి.

ఇక ఇలా నిల్వ ఉంచుకున్న ఈ పొడిని ఒక కప్పులో రెండు స్పూన్ల మోతాదులో తీసుకొని పాలు లేదా పెరుగుతో కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్ది సమయానికి కొబ్బరినూనెను దాంట్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. అలా ఆ ప్యాక్ అరే అంతవరకు వేచి ఉండి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా నెలలో సుమారు ఆరు నుండి ఎనిమిది సార్లు చేసినట్టయితే మొటిమలు, ముడతలు, మచ్చలు మరియు ఎండ వలన దెబ్బతిన్న చర్మం తిరిగి ఆరోగ్యంగా మారుతుంది అలాగే ముఖంలో కాంతి పెరుగుతుంది. ఈ పొడి చిన్న పిల్లల వాడినట్టయితే చర్మ రంగును టోన్ చేస్తోంది. ఈ పొడి తయారు చేయటం లో వాడిన ప్రతి మూలికం చర్మాన్ని తిరిగి ఆరోగ్యంగా చేయడానికి కచ్చితంగా ఉపయోగపడతాయి.