ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ కేసులు.. హై అలెర్ట్ ప్రకటిస్తున్న దేశాలు!

కరోనా వచ్చి ఏళ్లు గడుస్తున్నా తగ్గినట్లే తగ్గి మళ్లీ రూపాలు మార్చుకుంటుంది. అయితే ఇప్పటికే కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ లో ఎంతో మంది కరోనా దాటికి మరణించారు. ఇదిలా ఉంటే గతంలో థర్డ్ హెచ్చరికలు అంతగా ఉండకపోవచ్చునని భావించినా.. కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.దీంతో ప్రపంచ దేశాల ప్రజలు మరోసారి భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాట్లు డేంజర్ బేల్స్ మోగుతున్నాయి.ఇక 12 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలు హై అలెర్ట్ ప్రకటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

అయితే ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకారిగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శుక్రవారమే కీలక ప్రకటన చేసింది. ఏడు ఆఫ్రికన్ దేశాల(దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్) నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ దేశాలే కాకుండా భారత్, జపాన్, ఇజ్రాయిల్, సౌదీఅరెబియా, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్ , ఒమన్,అమెరికా బ్రిటన్ వంటి దేశాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి.