వామ్మో, ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా క్లిక్కయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పెద్ద దర్శకులు హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బిత్తిరి సత్తికి సీనియర్ యాంకర్ సుమ కంటే ఎక్కువ ఆదాయం అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విడుదలవుతున్న కొత్త సినిమాల స్టార్ హీరోలను ఇంటర్వ్యూలు చేస్తూ వైరల్ చేస్తున్నాడు.

   

బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలకు ప్రేక్షకాదరణ బాగా ఉండడంతో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం, మహేష్ బాబు ‘సర్కారువారిపాట’ జనాలను అలరించాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 టీం కూడా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేయించుకుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి బిత్తిరి సత్తితో చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్ గా మారింది. వెంకటేశ్ అయితే అచ్చు బిత్తిరి సత్తిలా మాట్లాడి నవ్వులు పూయించాడు. ఈ ఇంటర్వ్యూలతో బిత్తిరి సత్తి ఇమేజ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే డిమాండ్ కూడా బాగా వచ్చేసింది. ప్రస్తుతం బిత్తిరి సత్తి తీసుకునే రెమ్యూనరేషన్ చూసి మిగతా యాంకర్లు కూడా అవాక్కవుతున్నారు.

బిత్తిరి సత్తి ఒక షో కోసం దాదాపు 4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ తీసుకుంటున్నట్టు సమాచారం. మిగతా యాంకర్లతో పోలిస్తే బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు డిఫెరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. అతడి ప్రశ్నలు కామెడీ జనరేట్ చేసేలా ఉండడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతోంది. అందుకే తెలుగు యాంకర్లు రూ.2 లక్షల నుంచి మూడు లక్షల లోపే తీసుకుంటే బిత్తిరి సత్తి ఏకంగా రూ.5 లక్షల వరకూ తీసుకొని అందరు యాంకర్లకు షాక్ లు ఇస్తుండడం విశేషంగా మారింది.