మీ జుట్టు రాలడం ఆగిపోయి మళ్ళీ మూడు రెట్లు వేగంగా జుట్టు పెరిగేలా చేస్తుంది, ఈ రెమిడి జుట్టు రాలడం అంటే హెయిర్ ఫాల్ అవ్వడం, మన చేతుల్లో ఉండదు కానీ, మన జీవన శైలి మరియు ఆహారం యొక్క ప్రభావం కచ్చితంగా, మన వెంట్రుకలపై పడుతుంది, ఎందుకంటే వాతావరణ కాలుష్యం, మరియు చెడు ఆహార పదార్థాలు అలాగే హార్మోనల్ సమస్య వల్ల హెయిర్ ఫాల్ అనేది అధికంగా జరుగుతూ ఉంటుంది.అందుకే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే, వెంటనే మొదట్లోనే నిర్లక్ష్యం చేయకుండా, తగిన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం, లేకపోతే కొంతకాలానికి మీ హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా మారిపోయి బట్టతల వచ్చేస్తుంది, అందుకే ఒక అద్భుతమైన రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, ఈ రెమిడీ వాడడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, మూడు రెట్లు వేగంగా తొందరగా పెరుగుతుంది.
ఈ రెమిడీ కోసం మనం ఒక హెర్బల్ ఆయిల్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది, అయితే హెర్బల్ ఆయిల్ ను తయారు చేసుకోవడానికి మనకు మూడు పదార్థాలు ముఖ్యంగా కావాలి, ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థం తమలపాకులు, ఒక మూడు తమలపాకులను తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పుడు మనకు కావాల్సిన రెండవ పదార్థం కరివేపాకు, మన ఇంట్లో కూరల్లో ఉపయోగించే కరివేపాకు, ఒక కప్పు అంటే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి, ఇప్పుడు మనం చివరిగా తీసుకోవాల్సింది, మూడో పదార్థం కొబ్బరినూనె.దీనికోసం మీరు ఏదో ఒక రకమైన కంపెనీ కొబ్బరి నూనె, ఒక రెండు వందల ఎమ్మెల్ బాటిల్ తీసుకోవాలి, పారాషూట్ ఆయిల్ అయినా పర్వాలేదు, అయితే ముందుగా మనం మూడు తమలపాకులను తీసుకొని, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, తమలపాకులు మన వెంట్రుకలు రాలడం ఆపడానికి అద్భుతంగా పనిచేస్తాయి, ఎందుకంటే వీటి ప్రభావం మన వెంట్రుకల కుదుళ్లు అంటే, స్కార్ఫ్ పై ఉండే ఇన్ఫెక్షన్ తొలగించడానికి, అద్భుతంగా పనిచేస్తుంది, దీని వలన మన వెంట్రుకలు రాలడం ఆగిపోతాయి, ఇదే కాకుండా దీనితోపాటు ఎవరికైతే, హెయిర్ గ్రోత్ స్లో గా ఉంటుందో.
అలాంటి సమస్యను నివారించడానికి కూడా తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి, ముఖ్యంగా తలలో ఒక భాగంలో బట్టతల ఏర్పడుతూ ఉంటే, ఆ సమస్యను నివారించడానికి మళ్ళీ తిరిగి వెంట్రుకలు మొలవడానికి, తమలపాకులో చాలా బాగా సహాయపడుతాయి, అలాగే మనం తీసుకున్న రెండో పదార్థం కరివేపాకు, కరివేపాకు ఎందుకు తీసుకుందామంటే, కరివేపాకులో ఉండే బీటాకెరోటిన్ మరియు ప్రోటీన్ సన్నగా మారిపోయే వెంట్రుకలు మళ్ళీ తిరిగి దృఢంగా పెరిగేలా చేస్తాయి దీన్ని ఉపయోగించడం వల్ల వెంట్రుకలు రాలడం ఆగిపోయి, మళ్ళీ తిరిగి వెంట్రుకలు పెరగడం మొదలవుతాయి.ఇప్పుడు మనం ఈ మూడు పదార్థాలను ఉపయోగించి, ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కట్ చేసుకొన్న తమలపాకులు మొత్తం వేసి, అలాగే ఆ తర్వాత కరివేపాకు కూడా మొత్తం ఈ పాన్ లో వేయాలి, ఇప్పుడు బాటిల్ లో ఉన్న కోకోనట్ ఆయిల్ మొత్తం, ఈ కడాయిలో పోయండి.
ఆయిల్ మొత్తం పోసిన తర్వాత స్టౌ పైన అన్నింటిని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ లో ప్లే మీద ఉంచి, వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులో మనం వేసిన ఈ తమలపాకులు, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయి బ్లాక్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.తర్వాత కొద్ది సేపు ఈ నూనెను చల్లారనివ్వండి, చల్లారిన తర్వాత ఏదైనా జల్లి తీసుకొని వడకట్టుకోవాలి, లేదా మీరు కావాలి అనుకుంటే ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ సహాయంతో కూడా వాడకట్టుకోవచ్చు ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ హెయిర్ ఫాల్ సమస్యలను నివారించి, మళ్ళీ తిరిగి వెంట్రుకలు మూడు రెట్లు వేగంగా పెరిగే లాగా చేస్తుంది, మరియు మీ వెంట్రుకలు మందంగా దృఢంగా పెరుగుతాయి, అయితే దీనిని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, మీరు సాధారణమైన ఆయిల్, ఎలా ఉపయోగిస్తారు అదే విధంగా మీరు ఈ ఆయిల్ ని కూడా కొద్దికొద్దిగా తీసుకొని, మీ చేతి వేళ్లతో మీ కుదుళ్ళు, అంటే స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసి, కొద్ది సేపు మీ చేతి వేళ్లతో మసాజ్ చేసుకోవాలి.