ఆగష్టు 27 అమావాస్య ఈ 4 రాశులకు..

రాబోయే 27వ తేదీ శ్రావణ అమావాస్య, సర్వశక్తులు నిండినటువంటి ఈ అమావాస్య ఎన్నో శక్తులను నిండి ఉంటుందని ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి, ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనది ఇలాంటి రోజులలో ఈ యొక్క అమావాస్య కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే ఎన్నో గ్రహాలలో మార్పులు ఈ రాశుల వారికి శుభయోగాలను కలిగించబోతున్నాయని 14 ఏళ్ల దరిద్రం పోయి చీకొట్టిన వారే కాళ్ళు మొక్కు కాళ్ళు మొక్కేటటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అమావాస్య, పౌర్ణమి ఘడియల్లో ప్రతి నెలలో కూడా రాశులలో ఎన్నో మార్పులు జరుగుతాయి.

అయితే ఈ శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ గ్రహాల మార్పు ఎంతటి విశేషమైన యోగాలను ఇవ్వబోతుంది? మరి ఆ రాశులు ఎవరో ,ఏ విధమైన యోగాలను పొందబోతున్నారు? వివరంగా తెలుసుకుందాము!మొదటి రాశి తులా రాశి; ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. అనేక గ్రహాల సంచారం శుక్ర గ్రహం యొక్క సంచారం ఇలా అనేక రకాల సంచారాల వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు 11 వ ఇంట్లో సంచరించే సూర్యుడు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాడు. విపరీతమైన ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీడియా సినిమా రంగానికి సంబంధించి వారికి కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది.

వృత్తి ,వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు ఆర్థిక కష్టనష్టాలను నుండి బయట పడడానికి అవకాశాలు లేకపోలేదు. విపరీతమైన రాజయోగ పరిణామాలు మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎన్నో విజయాలను సాధిస్తారు, తమ నైపుణ్యంతో సామర్థ్యంతో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగబోతున్నారు. కెరీర్ లో కూడా మంచి స్థానానికి చేరుకుంటారు ఈ రాశి వారి జీవితంలో వివిధ మార్గాలలో హెచ్చుతగ్గులు అన్నీ కూడా తొలగిపోతాయి. విద్యారంగo వారికి అనుకూలంగా ఉంటుంది, మెడికల్, ఇంజనీరింగ్, మెకానికల్ చదివేవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతి అంశం లోను కూడా అదృష్టం రాబోతుంది రాబోయేటటువంటి రోజులు ఇంకా కొన్ని రోజుల్లోనే మీకు అదృష్టం ఆకాశాన్ని అంట పోతుంది.

అదృష్టం పట్టపోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి; ఈ రాశి వారికి త్వరలోనే శుభప్రదంగా ఉండబోతుంది ,అనేక గ్రహాల సంచారం కారణంగా ఎన్నో విజయాలను పొందబోతున్నారు. శుక్రుడు మీ రాశి నుండి రెండవ ఇంటిలో సంచరిస్తాడు, ఇది సంపద, ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రదేశము. అనేక మాధ్యమాల ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు, ఆకస్మికంగా ధన లాభాలు కలుగుతాయి, భాగస్వామితో కలిసి వ్యాపారం చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. లాయర్లు టీచర్లు మార్కెటింగ్ జాబ్ చేసే వారికి కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా, అద్భుతమైన అవకాశాలను, యోగాలను మీకు ప్రసాదింప చేస్తుంది అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి ఎక్కువగా ఈ రాశి వారికి ఇతరులను సొంతం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి కలను కలిగి ఉంటారు మరియు ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయడానికి అసలు ఇష్టపడరు. ఈ రాశి వారు తమ సంబంధాలను ఎంత చక్కగా నిర్వహించుకోవాలో వారికి తెలుసు. సాధారణ సమయం కంటే కూడా మెరుగ్గా ఆనందిస్తారు.

తర్వాత రాశి వృశ్చిక రాశి వారు; ఈ వృశ్చిక రాశి జాతకులకు అద్భుతమైన యోగాలు త్వరలోనే రాబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి రానున్నటువంటి కాలం ఇంతటి అదృష్టాన్ని మరలా చూడలేము అన్నట్లుగా ఉంటుంది. ఈ రాశి చక్రం ప్రకారం 10 వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు, వ్యాపారము ఉద్యోగానికి సంబంధించిన శుక్ర గ్రహం. ఈ కారణంగా వచ్చేటటువంటి రోజుల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభిస్తాయి కొత్త కొత్త సంబంధాలు కూడా బలపడతాయి. మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో కూడా ఉన్నతంగా రాణిస్తారు రాజకీయపరంగా కూడా ఎదుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మెరుగైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడుతో చంద్రుడు కలిసి ఉండడం కారణంగా మీరు చేసే పనుల్లో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.

అదృష్టం పట్టబోతున్న చివరి రాశి కుంభరాశి, కుంభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన కాలం. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఊహించలేరు అంత అద్భుతంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కూడా అనుకున్న ఫలితాలనే పొందుతారు. భూమి, ఆస్తి లేదా వాహనాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ కాలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థుల జీవితంలో ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో కూడా విద్యను అభ్యసించడానికి కూడా విద్యార్థులు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు వైద్య లేదా పరిశోధన విద్యను అభ్యసించే విద్యార్థులు విజయాలను సాధిస్తారు. అద్భుతమైన కాలం మీకు ముందు ఉంది కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన కాలం ముందు ఉండబోతుంది వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడంలో కూడా మీకు సహాయపడుతుంది, మీ కుటుంబం నుండి కూడా మీరు ఆర్థిక సహాయాన్ని పొందుతారు, ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి.