ఆలుగడ్డ లో ఉన్న మహత్యం తెలిస్తే..

బంగాళదుంపలు అంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇవి మెత్తగా తేలికగా ఉడుకుతాయి తినేటప్పుడు ఈజీగా రుచికరంగా లోపలికి వెళ్తాయి మరి అలాంటి బంగాళదుంపలను మనం తిన్నప్పుడు, ఆ తర్వాత చాలా సేపు ఆకలి సరిగ్గా వేయదు. మరి బంగాళాదుంపలు తిన్న తర్వాత ఆకలి త్వరగా వేయకపోవడానికి ఏదైనా సైంటిఫిక్ గా రీసన్ ఉందా అంటే రెండు రకాలుగా రీసన్స్ ఉన్నాయి. ఒకటి బంగాళాదుంప 100 గ్రాములు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి, అలాగే కూరగాయలు 100 గ్రాములు తీసుకుంటే 25 క్యాలరీల శక్తి, అంటే కూరగాయల కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తిని బంగాళాదుంపలు అందిస్తాయి. అంటే ఫోర్ టైమ్స్ క్యాలరీస్ ఎక్కువ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి తేలికగా జీర్ణం అయ్యి త్వరగా బ్లడ్లోకి వెళ్లిపోయి శరీరానికి కావలసిన క్యాలరీస్ ని పుష్కలంగా అందిస్తాయి.

అందుకని బాడీ త్వరగా ఆహారం కావాలి అనే డిమాండ్ లేకుండా రిజర్వులో బోలెడంత ఉంది నువ్వు అప్పుడే తినవద్దు అని కూడా అన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ బాడీ లోకి వెళ్ళినప్పుడు ఒక విధంగా ఆపే ప్రయత్నం అలాగే ఆకలి లేకుండా బాడీ చేస్తుంది. రెండవ సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే బంగాళదుంపను తిన్న తర్వాత అందులో ఉండే కెమికల్ కాంపౌండ్ పొటాటో , ప్రోటీనేజ్ , ఇన్ హీబేటర్ టు _అనేది అనేది ఇందులో ఉంటుంది ఇది మన పొట్ట ప్రేగుల్లోకి వెళ్లిన తర్వాత కొలిసిస్టో కయినీన్ అనేదానిని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, ఇది ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పటికి ఆకలి అనేది త్వరగా వేయదు. ఈ కొలిసిస్టో కయినీన్ అనేది తక్కువ రిలీజ్ అయినప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. అందుకని బంగాళదుంప తిన్న తర్వాత ఆకలి వేయకపోవడానికి కూడా ఈ రీసన్ సైంటిఫిక్ గా ఉంది, అందుకని ఈ రెండు రకాల రీజన్స్ తో బంగాళా దుంపలు తిన్నప్పుడు ఆకలి త్వరగా వేయదు.

కానీ మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది మేము పొటాటో చిప్స్ తింటున్నాం కదా పొటాటో ఫ్రై తింటున్నాం కదా మాకు వెంటనే ఆకలి వేస్తుంది కదా అని అనవచ్చు. బంగాళదుంప వoడే తీరును బట్టి ఆకలి పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది. బంగాళదుంపలను మామూలుగా ఉడకబెట్టి కూర లాగా చేసుకుని తింటే మాత్రం ఆకలి వేయకుండా కంట్రోల్ చేసే మెకానిజం కరెక్ట్ గా పని చేస్తుంది. అదే బంగాళాదుంపను మనం డీఫ్రై చేసి తిన్న చిప్స్ రూపంలో తిన్న ఈకొలిసిస్టో కయినీన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు అప్పుడు ఆకలి అనేది ఆటోమేటిగ్గా వేస్తుంది ఎందుకంటే డీఫ్రై చేసినప్పుడు మెకానిజమంతా ఆ వేడికి మారిపోతుంది. మామూలుగా 200 నుండి 260 డిగ్రీల వేడికి బంగాళదుంపను గురిచేసినప్పుడు, బాగ నూనె వేసి ఫ్రై చేసినప్పుడు ఆ హీట్ కి చాలా చేంజ్ వస్తాయి దీనివల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చిప్స్ కానీ డీఫ్రై లు తిన్నప్పుడు ఆకలి బాగా వేస్తుంది.

అలా కాకుండా నేచురల్ గా ఉడకపెట్టి తిన్న దుంపలను చప్పగా కూరలో వండుకు తిన్న అప్పుడు ఈ మార్పు అనేది బాగా కనిపిస్తుందని సైంటిఫిక్ గా 2016లో శ్రీలంక వారు దీనిమీద పరిశోధన చేసి నిరూపించారు. అందుకని ఈరోజుల్లో బంగాళాదుంపల వల్ల ఎక్కువగా వెయిట్ పెరగడానికి కూడా రీసన్ ఏమిటంటే ఫ్రై రూపంలో చిప్స్ రూపంలో ఇంకా మరో రూపంలో డీప్ ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఈ మెకానిజం పనిచేయక ఇంకెక్కువగా ఆకలి వేస్తుంది అలాగే ఇంకా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ బాడీ లోకి వెళ్లిపోయి ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడానికి రీసన్ అవుతుంది. వండుకునే తీరు కూడా మనం ఎక్కువ తిండి తినడానికి కారణం అవుతుంది అలాగే తక్కువ తిండి తినడానికి కారణం అవుతుంది కాబట్టి కాస్త ఆలోచించి తింటే బాగుంటుంది.