ఆ వ్యాధితో బాధపడుతున్న గృహలక్ష్మి కస్తూరి! సీరియల్ పరిస్థితి ఏంటి?

కస్తూరి అంటే పెద్దగా ఎవరికి తెలీదు. అదే గృహలక్ష్మి కస్తూరి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. గృహలక్ష్మి కస్తూరి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో మనందరికి తెలిసిందే. షూటింగ్ విషయాలతో పాటుగా తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కస్తూరి.

తన నటనతో పాటుగా అందంతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక తాజాగా తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది కస్తూరి. తనకు ఓ వ్యాధి సోకిందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం పంచుకుంది కస్తూరి.కస్తూరి అంటే పెద్దగా ఎవరికి తెలీదు. అదే గృహలక్ష్మి కస్తూరి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు.సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటూ.. తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా మరో ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది కస్తూరి. తనకి చికెన్ పాక్స్ ( అమ్మవారు) సోకిందని, ఈ వ్యాధి సోకితే శరీరం చాలా వికృతంగా తయ్యారు అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికే తన శరీరంపై మచ్చలు, మెుటిమలు లాంటివి వచ్చాయని తెలిపింది. అయితే అదృష్టవశాత్తు కళ్లపై అవి రాలేదని కస్తూరి చెప్పుకొచ్చింది. వారం రోజులు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. దాంతో సీరియల్ కు అంతరాయం కలుగుతుందని అభిమానులు బాధపడుతున్నారు. ఇక తన హెల్త్ కోసం ప్రార్థిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపింది కస్తూరి.