ఆ షో ఒక్కో ఎపిసోడ్‌కి సుమ ఎంత తీసుకుంటుందో…

యాంకర్ సుమకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు, ఆమె స్టేజ్ ఎక్కిందంటే చాలు స్టేజ్ దగ్గర వెళ్ళాల్సిందే, తనదైన యాంకరింగ్ తో ఆహుతులను కట్టిపడేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఓ సినిమా ఈవెంట్ జరగాలి అంటే ఆమె అక్కడ తప్పకుండా ఉండాల్సిందే, ముఖ్యంగా పెద్ద పేరున్న బ్యానర్లు ఆమె లేనిదే షోలు చేయవంటే నమ్మి తీరాల్సిందే. ఇకపోతే వాటితో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న షో పేరు క్యాష్. ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారమవుతున్న క్యాష్ కార్యక్రమం కు, ఇప్పటికీ కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇక ఎన్ని సంవత్సరాలుగా ఒక రియాల్టీ షో ఎందుకు కొనసాగుతుంది.

అని ఎవరైనా అడిగితే కేవలం సుమ ఉండడం కారణంగానే తాము క్యాష్ కార్యక్రమాన్ని చూస్తున్నామని, కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం కూడా సెలబ్రిటీలను తీసుకువచ్చి, వారితో ఆటలాడిస్తూ ఎంటర్టైన్మెంట్ ని పండిస్తూ, క్యాష్ ప్రోగ్రాంలో సుమది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి. ఎన్నో డైలాగులను గుర్తుపెట్టుకుంటూ, వచ్చినా కంటెస్టెంట్ ని మేనేజ్ చేస్తూ, ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. కనుకనే ఈ స్థాయిలో రేటింగ్ రావడంతో పాటు ఇన్నాళ్లు కొనసాగుతుంది .ఇక ఈ రకంగా ఆ షో రక్తి కట్టడానికి సుమ ఎంతగానో పరితపిస్తుంది. ఈ క్రమంలో అనేకమందికి ఓ విషయంలో డౌట్ ఉంటుంది.

ఆ షో చేసినందుకు కాను ఆమెకు రెమ్యూనికేషన్ ఎంత ఇస్తారు అనేది, ఆమె ఎంత తీసుకుంటారు అనేది, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్యాష్ ఒక్క ఎపిసోడ్ కి గాను, ఐదు లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటుందని వినికిడి. 5 లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనంగా అవి ఒక 50,000 రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్షలు ఎపిసోడ్ కి సుమా తీసుకుంటుంది అంటూ సమాచారం అందుతుంది. సుమా క్యాష్ కార్యక్రమం మొదట్లో ఒక ఎపిసోడ్కి 50 వేల నుండి 70,000 పారితోషకం తీసుకునేదట కానీ, ఇప్పుడు ఆ పారితోషకం ఎన్ని రేట్లు పెరిగిందో చూడండి.