ఈ టిఫిన్లు తినకండి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న

ప్రతి రోజు ఎదో ఒకటి అల్పాహారంగా తీసుకోవడం తప్పనిసరి . కాని అల్పాహారం కోసం ఉప్మాలు లేదా ఇడ్లి లు అంటూ మనం తీసుకునే ఇప్పటి టిఫిన్లు ఆరోగ్య కరం కాదు అని అంటున్నారు నేచురోపతి డాక్టర్లు . ఆయిల్ తో నిండిన పూరీలు, బజ్జిలు వంటివి తినడం వలన అనారోగ్యాల పాలవుతారు అని చెబుతున్నారు . మినపప్పు గుండు పప్పు కాకుండా పొట్టుమినపప్పు తీసుకుని సగం పొట్టు ఉండేలా కడిగి ఇడ్లి రవ్వకు బదులు కొర్రలతో చేసిన ఇడ్లిలు చిరుధాన్యాలను ఉపయోగించి అనేక రకాల అల్పాహారాలు తాయారు చేసుకోవచ్చని చెబుతున్నారు .

ఈ లాంటి టిఫిన్లు ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి అధిక శక్తి ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి . అసలు లేచిన వెంటనే ఒక లీటరు నీటిని తాగాలి . ఆనీరు గోరువెచ్చనివి అయితే మరి మంచిది . తర్వాత వీలైనంతవరకు పండ్లు ,మొలకలు వంటి ఆరోగ్య కరమైన ఆహారాలు తీసుకోవాలి . అలాగె మధ్యాహ్నం భోజనంలో అన్నంకి రెండు రేట్లు కూరలు తీసుకోవాలి . ఏ కూరగాయలు ,ఆకుకూరలు అయినా సరే ఉప్పు ,కారం తగ్గించి తక్కువ మోతాదులో అన్నం ఎక్కువ మోతాదులో కూరలు తీసుకోవాలి అలాగే నాన్ వెజ్ మూడు నెలల పాటు మానేయవచ్చు . సాయంత్రం పూట మనం ఎంత అయితే ఆహారం తీసుకుంటామో అంతే మొత్తం లో పండ్లను ఆహారంగా తీసుకోవాలి .

ఇలా తీసుకోవడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులు వాటంతట ఏవ్ తగ్గుతాయి . వీటితో పటు రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. రోజుకు రెండు రకాల పండ్ల రసాలు తీసుకోవాలి . వాటితోపాటు కూరగాయల జ్యాస్ లు కూడా తీసుకోవచ్చు . ఉదయాన్నే కొత్తిమీర ,పుదీనా కలిపి జ్యూస్ ,క్యారెట్ ,బీట్రూట్ కలిపిన జ్యూస్,పాలకూర ,కరివేపాకు జ్యూస్ మునగాకు ,కరివేపాకు జ్యూస్ ఇలాంటి జ్యూస్ లను కూడా తీసుకోవచ్చు . లేత సొరకాయ ,బీరకాయ ,టమాటా కలిపి మీక్సుడు వెజిటేబుల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు . ఇవన్ని శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి . శరీరంలో పేరుకున్న విషావ్యర్దాలను పంపిస్తాయి . ఇప్పుడు చెప్పిన డైట్ పాటిస్తూ ,ఆర్థరైటిస్ ,డయాబెటిస్ ,బిపి వంటి అనేక రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు .