ఈ వేరు మీ దగ్గర ఉంటే జన ఘోష, నరగోష, కనుదృష్టి, బాధలు ఇబ్బంది పెట్టవు.

మనం ఇప్పుడు చూస్తున్నా మొక్క గురించి మనందరికీ బాగా తెలుసు. ఈ మొక్క పూలు అలాగే ఈ మొక్క యొక్క ఆకులు సర్వాంగాలు అంటే, ఈ మొక్కకు సంబంధించిన వేర్లు కాడ, బెరడు ,ఆకులు ,పూలు, గింజలు అన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉంటారు. జీవితంలో ఇది ఎప్పుడూ కూడా మన ఇంటి దగ్గరలో ఉంటుంది, అలాగే పంట కాలువల దగ్గర ఉంటుంది, ఇప్పుడు వానకాలం కాబట్టి ఈ మొక్కలు చాలా బాగా వస్తుంటాయి.

వీటిని ద్రోని పుష్పాలు అంటారు లేదా తుమ్మి పూలు అంటారు. ఈ మొక్కలు అద్భుతమైన తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయి. ఈ మొక్కను మనం విధివిధానంగా వాడుకోగలిగితే ఆయుర్వేద పరంగా కాకుండా తాంత్రిక పరంగా కూడా చాలా ఫలితాలను చూడవచ్చు. అయితే ఈ రోజు మనం ఈ మొక్కకు సంబంధించి ఒక రెండు తాంత్రికమైన పరిహారాలను తెలుసుకుందాం. మనం జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకి తేలికైన పరిష్కారాన్ని ఈ మొక్క ద్వారా తెలుసుకుందాం.

ఈ మొక్క వేరు మనకి అద్భుతమైన శక్తిని ఇస్తుంది, ఈ మొక్క వేరుని మనం విధివిధానంగా తెచ్చుకొని మనం తావీజులో పెట్టే ధరించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఎవరైనా సరే అంటే ఆడవారైనా మగవారైనా ఈ మొక్కని ముందుగా గుర్తించాలి దీన్ని మంగళవారం రోజు చేయాల్సి ఉంటుంది. మీరు దానికి ముందు రోజే ఈ మొక్కను గుర్తించి, దానికి కొద్దిగా నీళ్లు పోసి నమస్కారం చేసుకుని మనసులో నేను రేపు పొద్దున వచ్చి తీసుకెళ్తాను అని చెప్పుకోండి.

ఈ పరిహారాన్ని మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే చేయాలి. తర్వాత మంగళవారం ఉదయాన్నే మొక్క దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకుని నాకున్న బాధలకి, నా కుటుంబ అవసరం కోసం నేను నిన్ను తీసుకు వెళ్తున్నాను నా బాధల నుండి విముక్తి కలగాలి అని చెప్పుకొని తీసుకోవాలి.

ఈ మొక్కను సమూలంగా వేర్లతో సహా తెచ్చుకొని, ఈ వేర్లను చక్కగా కడిగి మీరు అదే రోజున పక్కన పెట్టుకోండి, మీరు ఈ మొక్క నుండి వేర్లను సపరేట్ చేయండి. దీంట్లో ఏదైనా తావీజు ఉన్నట్లయితే అవి తీసుకోండి లేదంటే మార్కెట్లో ఇది మనకు దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చుకోండి. ఎవరికైతే ఎక్కువగా కష్టాలు, బాధలు ,కను దిష్టి, నరదిష్టి , భూత, ప్రేత పిశాచ బాధలు ,ఎక్కువగా ఉంటాయో వారు ఆ వేరును తావీజులో పెట్టుకోవాలి.