ఈ 1 చిట్కాతో ఎసిడిటీ,అజీర్తి,మలబద్దకం తగ్గి మీ పొట్ట పూర్తిగా శుభ్రం..అధిక బరువు,పొట్ట…

చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలి యువత, అనే తేడా లేకుండా భారీ పొట్టతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇలా పొట్టలో కొవ్వు పేరుకుపోయి, అనేక వ్యాధులకు గురి అవుతున్నారు, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, దానికి కారణం శారీరక శ్రమ లేకపోవడం ఒకటైతే, మనం తినే ఆహారం మరొకటి ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ ను ఎక్కువగా తినడం తోనే, పొట్ట పెరుగుతుంది.బరువు కూడా పెరుగుతుంది, అయితే పొట్ట ఉంది బరువు ఉంది, అని ఒత్తిడికి లోను కావద్దు ఒత్తిడికి లోను అవుతాయి, శరీరంలో వత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి, ఫలితంగా అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి పొట్ట ఎక్కువగా ఉన్నవారు బరువు అధికంగా ఉన్న వారు, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, రోజు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ముఖ్యమే, తగినన్ని గంటల పాటు నిద్ర లేకపోవడం వల్ల కూడా, అధికంగా బరువు పెరుగుతారు.

కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు అయినా నిద్ర పోవాలి, దీంతో శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి, ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది, రోజుకు కనీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి, నిత్యం చేసే వ్యాయామంలో, కొంత సమయమైనా చాలా కఠినంగా ఉండే వ్యాయామాలను చేస్తే, అధిక బరువు పొట్ట దగ్గర కొవ్వు త్వరగా తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా మెట్లు ఎక్కడం దిగడం బరువులు తగ్గిస్తాయని, ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఆయుర్వేదం లో పొట్టకు సంబంధించి, అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఇలాంటివన్నీ పేరుకుపోయి, ఇబ్బంది పడే అటువంటి సమస్యను అధిగమించడానికి, మనకు ఒక చక్కని ఆయుర్వేద రెమిడి అనేది ఉంది, ఆ రెమిడి ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం, చాలామంది ఇప్పుడు బిజీ లైఫ్ లోనే బతుకుతున్నారు, కాబట్టి ఈ బిజీ లైఫ్ లో ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్త వహించకపోతే పోవడం వలన, అదేవిధంగా పూర్తిగా కడుపు శుభ్రంగా కాకపోవడం వల్ల,మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ ఇలాంటివన్నీ కూడా మనల్ని వేధిస్తున్నాయి.

వీటితోపాటుగా అధికబరువు ఆజీర్తి సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే, చాలా కామన్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు, శరీరంలో ఉండేటటువంటి డైజెస్టివ్ సిస్టం ఏదైతే ఉంటుందో, అది మన మిగతా శరీర అవయవాలకి చాలా బలాన్ని చేకూర్చుతుంది, ఎందుకంటే దీని నుండి మన శరీరంలోని, ప్రతి అవయవానికి కూడా ఎనర్జీ అందుతుంది కాబట్టి, ఎప్పుడైనా కడుపులో ఉండేటటువంటి డైజెస్టివ్ సిస్టం ఎప్పుడైతే, ఇబ్బందిపడుతూ ఉంటుందో, అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందో, దాని యొక్క ప్రభావం అనేది, మన యొక్క శరీరంలో ఉండేటటువంటి మిగతా బాడీ పార్ట్స్ పైన, అంటే శరీర అవయవాలపై పడుతుంది

మన కిడ్నీ లివర్ గుండె ప్యాంక్రియాస్ ఊపిరితిత్తుల బోన్స్, అదేవిధంగా స్కిన్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పడతాయి కాబట్టి, మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా మన కడుపు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా, చూసుకోవడం అనేది చాలా అవసరం. ఎవరికైతే ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వదు, అలాంటి వారికి మలబద్దక సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది, దీని వల్ల తినే ఆహారంలో ఉండేటటువంటి మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు, మన ప్రేగులలో ఉండిపోతాయి, దీనివల్ల కొద్దికొద్దిగా మన కడుపులో గ్యాస్ సమస్యలు పెరిగి పోతాయి, కడుపు పూర్తిగా శుభ్రం కాకపోవడం వల్ల కూడా, రోజు మొత్తం మన శరీరం అలసట కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుండి..