ఉగాది పచ్చడి ని ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం,ఐశ్వర్యం ! మనిషి దేహం వజ్రంలా మారుతుంది…

ఏప్రిల్ 2 , 2022న శ్రీ శుభ కృత నామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి మన తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీ.ఈ రోజు మన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకుని ,సంవత్సరం మొదటి రోజు తింటే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం!ఈరోజు ఎవరైతే పరగడుపున వేపపూత తో చేసిన ఉగాది పచ్చడి ని తింటారో, అలాంటివారికి పూర్ణ ఆయుర్దాయం, వజ్రం తో సమానమైన దేహం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దలు చెబుతారు.ఉగాది రోజు పరగడుపున ఉగాది పచ్చడి తింటే మనిషి దేహం వజ్రంలా తయారవుతుందని ,అలాంటి పోషకాలు అందులో ఉన్నాయని గ్రహించి ఉగాది రోజు ఇలా ఉగాది పచ్చడి ని తినాలని మన పెద్దలు ఆచారంగా పెట్టారు. ఈరోజు ఇలా ఉగాది పచ్చడి తినడం వల్ల ఇందులోని పోషకాలు రక్తంలో కలిసిపోయి, ఈ సంవత్సరం వరకు వాటి ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

అదేవిధంగా షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి అంటే తీపి ,పులుపు, ఉప్పు ,కారం ,వగరు, చేదు ఈ ఆరు రుచులు సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను ,కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ ఉగాది పచ్చడిని ఈ కాలంలో వేప పూత ఉన్నంతకాలం తినడం చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం!ఉగాది పచ్చడి అనేది ప్రాంతాన్ని బట్టి కొద్దిగా తేడా ఉంటుంది. కానీ మామిడి, వేప పూత, చింతపండు కచ్చితంగా ఉపయోగించాలి. ఉగాది పచ్చడి కి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, బాగా పండిన అరటి పండు, వేప పూత, చింతపండు, బెల్లం, పచ్చి మామిడికాయ. ముందుగా మనం పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత చింతపండు పులుసులో తగినంత ఉప్పు,కారం, మామిడి ముక్కలను వేసుకోవాలి. తర్వాత మెత్తగా దంచిన బెల్లాన్ని వేసుకోవాలి, తర్వాత అందులో అరటిపండు ముక్కలను వేసుకోవాలి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత వేపపువ్వును సరిపడా వేసుకోవాలి, తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.

పదినిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి మనకు ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని చదివి తినడం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది సకల శుభాలు కలుగుతాయి, “శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కారాయచ ) సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం” దీని అర్థం ఏమిటంటే వేపపూత తో చేసిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రంలా మారుతుంది అని, సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థం. ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉగాది పచ్చడి తినడం వల్ల ఎలాంటి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది. ఎలాంటి వైరస్ అయిన మాయమై పోవాల్సిందే, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కుష్ఠు రోగాన్ని నయం చేస్తుంది, నాలుకకు రుచిని కలిగిస్తుంది, వాతాన్ని హరిస్తుంది.