ఉల్లిపాయతో రాత్రికి రాత్రి కాళ్ల పగుళ్లు మాయం…!!

Cracked Heels : వాతావరణ మార్పులను బట్టి మన శరీరంలో కూడా కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మన అరికాళ్ళు పగులుతూ ఉండడం కూడా ఒకటి. చర్మం పొడిబారడం వల్ల అరికాళ్ళ పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్లను అశ్రద్ధ చేస్తే చర్మవ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ పగిలిన అరికాళ్ళలోకి మరింత దుమ్ము దూరం చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. కూడా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. మరి ఇటువంటి కాళ్ళ పగుళ్లను ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా సింపుల్ హోమ్ రెమిడితో ఎలా నయం చేసుకోవచ్చు.

శరీరం వల్ల అంటే తగినంతగా నీటి శాతం లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ సమస్య మహిళలకు వస్తుంది. కాబట్టి వాళ్ళు రోజువారి చేసే పనుల్లో కెమికల్ ఏదైనా తగిలినా కూడా కాళ్లకు రియాక్షన్ వచ్చి ఇలా పగులుతాయి.అంటే బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ వల్ల కూడా కాళ్లు పగిలే అవకాశాలుంటాయి. అంతేకాకుండా కాళ్లు పగులుతూ ఉంటాయి. ఇక థైరాయిడ్ తో బాధపడే వాళ్లకు కూడా కాళ్లు పగిలే సమస్య ఉంటుంది. కొందరికి ఈ పగుళ్లు చిన్నగా ఉంటే మరికొందరికి చాలా లోతుగా పెద్దదిగా పగులుతూ ఉంటాయి. వీటిలో నుంచి ఒక్కొక్కసారి రక్తం కారుతూ ఉంటుంది. ఇది ఏమంత పెద్ద సమస్య కాకపోయినా దేన్నైనా మనం నిర్లక్ష్యం చేస్తే పెద్దదిగా మారిపోతుంది.

కాబట్టి కొన్ని రకాల హోమ్ రెమిడీస్ తో ఇంట్లోనే ఈజీగా మన పాదాలను శుభ్రం చేసుకోవచ్చు. అలాగే కాళ్ళ పగుళ్లను కూడా నయం చేసుకోవచ్చు. మరి రెమిడి ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసి గ్రేటర్ తో తురుముకోవాలి. తర్వాత దాని నుంచి చక్కగా రసం తీసుకోండి. ఇక దానిలో ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత దానిలో బేకింగ్ పౌడర్ కూడా చిటికెడు వేసి కలుపుకోవాలి. ఈ బేకింగ్ సోడా ఎలాంటి వాటినైనా శుభ్రం చేస్తుంది. ఇక నిమ్మ చెక్క యాంటిబయోటిక్ గా ఉపయోగపడుతుంది. ఎలాంటి పగుళ్లు అయినా సరే తగ్గిస్తుంది. ఇక దీనిలో వైట్ టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. దీనిని బాగా కలిపిన తర్వాత ముందుగా మీ కాళ్ళని నీటితో గాని సబ్బుతో గాని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తో దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.

తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మీ పాదాల పగుళ్ల దగ్గర అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఒక నలభై నిమిషాల తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడుక్కోవచ్చు. ఇలా ఒక వారం రోజులు పాటు చేసినట్లయితే మీ కాళ్లు మృదువుగా దూదిలా మారిపోతాయి. ఇప్పుడు మరొక రెమిడి ఏంటో చూద్దాం.. మీకు మెడికల్ షాప్ లో వ్యాస్లిన్ అని ఒక చిన్న డబ్బా దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి ప్రతిరోజు మీ కాళ్ళ పగుళ్ల దగ్గర అప్లై చేసి మసాజ్ చేసినట్లయితే ఈ వ్యాస్లిన్తో మీ కాళ్ళ పగుళ్లు ఇట్టే తగ్గిపోతాయి.

మరొక రెమెడీతో కూడా మీ కాళ్ళ పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల కొబ్బరినూనె వేసి దానిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాళ్ల పగుళ్లకు అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేసి వదిలేస్తే మీ కాళ్ళను పగుళ్లతో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పసుపులో యాంటీబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి నొప్పినైనా సరే ఇట్టే తగ్గిస్తుంది. ఈ విధంగా ఈ రెమెడీలను మీ కాళ్ళ పగులకు వాడినట్లయితే మీ కాళ్ళ పగుళ్లు తగ్గి మృదువుగా దూదిలాగా తయారవుతాయి.