ఏప్రిల్ 2 ఉగాది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ రంగు దుస్తువులు కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకు అదృష్టం

ఏప్రిల్ 2, 2022 నశ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది ప్రారంభం అవుతుంది, ఉగాది తెలుగువారు జరుపుకునే చాలా పెద్ద పండుగ ఎంతో ముఖ్యమైన పండుగ, తెలుగు సంవత్సరం ఈ రోజుతోనే మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభించారని ప్రతీతి.మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు సోమకుడిని సంహరించి, వేదాలను బ్రహ్మకు అప్పగించిన ఈ సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది,చైత్ర శుద్ధ పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది ,అయితే ఇంతటి విశేషమైన రోజు ప్రతి ఒక్కరూ ఏ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా ఐశ్వర్యం కలుగుతుందో ఈరోజు తెలుసుకుందాం!

బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించు కొనిపోతాడు, వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తిసామర్థ్యాలు బ్రహ్మ దగ్గర లేవు, ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షం అవ్వగా బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువుతో ఇలా అంటాడు.దేవా నీకు తెలియనిది ఏముంది, ఈ ఈ లోకాలన్నీ నీవల్లే పెరిగి తిరిగి నశిస్తున్నాయి, అని జరిగిన సంగతి చెప్పాడు, ఆ వేదాలను రాక్షసుడు సముద్రంలో దాచాడు అని చెప్తాడు, అప్పుడు మహావిష్ణువు మత్స్య అవతారం లో వెళ్లి సోమకాసురుడు ని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు.

ఉగాది లో ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు వస్తాయి, వీటికి ఆది ఉగాది ఈరోజే కలియుగం ప్రారంభమైంది, ఉగాది రోజున కొన్ని రంగుల బట్టలను వేసుకోకూడదు, ఇలా వేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి,మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులను ధరించాలి, కొన్ని రంగుల వల్ల కొన్ని గ్రహాల అనుగ్రహం ఉంటుంది , ఉగాది రోజున ఎవరైనా సరే ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా ఉగాది రోజున కొత్త బట్టలు ధరించాలి. ఉగాది రోజున ఎరుపు రంగులో ఉండే దుస్తులను, పింక్ కలర్ లో ఉండే దుస్తులను కట్టుకోవాలి, అలాగే పసుపు రంగు, ఆరెంజ్ కలర్ లో ఉండే దుస్తులను కూడా ధరించవచ్చు, మొత్తం నాలుగు రంగులలో ఏ రంగు అయినా సరే ధరించవచ్చు, నాకు వీటి కాంబినేషన్లో కూడా ధరించవచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సంతోషంగా ఉండే అవకాశాన్ని ఆ భగవంతుడే కల్పిస్తాడు.