ఏప్రిల్ 30 అతిపెద్ద సూర్యగ్రహణం ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే…..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం శుభసూచకం కాదు. అయితే ఇది కొంతమందికి శుభప్రదం కావచ్చు, సూర్య కిరణాల ప్రభావం మేషం నుండి మీనం వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం!ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల 7 నిమిషాల వరకు ప్రభావం ఉంటుంది. మొట్ట మొదటి రాశి మేష రాశి వారు, ఈ రాశివారికి సూర్యకిరణాల ప్రభావం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.దీంతో సూర్య గ్రహణం రోజున ఆర్థిక సంబందమైన పనులు మానుకోవడం మంచిది. మేష రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది. తర్వాత రాశి వృషభ వారికి సూర్యగ్రహణం రోజున ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతుంది.

దీంతో ఈ రాశివారు ఆ రోజున అనవసరమైన కోపం లేదా ఒత్తిళ్లకు దూరంగా ఉంటే మంచిది. మీ మాట తీరు వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ,కావున మీరు ఎవరితోనైనా సరే మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రహణ సమయంలో పరమ శివుని ఆరాధిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో చేసే జపానికి కోటి రెట్ల పుణ్య శక్తి ఉంటుంది కాబట్టి పరమ శివుని ఆరాధిస్తే సరిపోతుంది. గ్రహణం తర్వాత శివునికి అభిషేకం చేయించుకోండి. తర్వాత మిధున రాశి వారు , ఈ సూర్య గ్రహణం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి, నీ చుట్టూ జరిగే సంఘటనల పై ఒక కన్ను వేసి ఉంచండి. తర్వాత కర్కాటక రాశి సూర్యగ్రహణం మేలు చేస్తుంది. కుటుంబ జీవనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి, అంతేకాకుండా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా గట్టెక్కుతాయి, కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 30 వ తేదీన రాబోయే సూర్య గ్రహణం విశేషమైన ఫలితాలను తీసుకు రాబోతుంది. కర్కటక రాశి వారి జీవితంలో ఉన్నతమైన రాబోతుంది. గ్రహణం తర్వాత గ్రహాల లో జరగబోయే మార్పులవల్ల అంత మేలు జరగబోతుంది. వీళ్లు గ్రహణ సమయంలో ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించి నట్లయితే మీకు ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది,గ్రహణం వల్ల వచ్చే ఒడిదుడుకులు పోతాయి.

సింహ రాశి వారు, ఈ రాశివారికి గ్రహణం యొక్క ప్రభావం వల్ల వ్యాపారంలో లాభం ఉంటుంది, అయితే సూర్య గ్రహణం రోజున ఆర్థిక వ్యవహారాలలో పెట్టుబడులలో దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది. గ్రహణ సమయం లో ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. తర్వాత కన్య రాశి వారు, గ్రహణం రోజున ఈ రాశి వారు కష్టపడి పనిచేస్తే విజయాన్ని తప్పకుండా సాధిస్తారు, విజయం సాధించే సమయంలో ఉద్యోగ విషయాలను పక్కన పెట్టడం ఉత్తమం. గ్రహణ సమయంలో మీరు తప్పకుండా పరమశివుణ్ణి ఆరాధించండి. గ్రహణం తర్వాత పరమశివునికి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. తర్వాత రాశి తులా రాశి, ఈ రాశి వారికి గ్రహణం రోజున అంతగా కలిసి రాదు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, సూర్య గ్రహణం రోజున లీగల్ వివాదాల జోలికి అస్సలు వెళ్ళకండి, అటువంటి వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. గ్రహణం రోజు ఈ రాశుల వారు పరమశివుణ్ణి ఆరాధించుకుని గ్రహణం తర్వాత పరమ శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే నీకు ఎంతో మేలు జరుగుతుంది.