ఒక్క వీడియో 500 రోగాల రహస్య హెల్త్ టిప్స్ చిట్టా

కొన్ని ప్రకృతి వైద్య నియమాలను ఇంట్లో ఫాలో అవ్వడం కుదరని వారికి ఇంట్లో ఇన్స్పిరేషన్ రానివారికి ఇంట్లో కాస్త అన్ని నేర్చుకోవడానికి కాస్త భయపడే వారికి ప్రకృతి ఆశ్రమాలలో చేరడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మీకు అందుబాటులో ఉన్న ప్రకృతి ఆశ్రమంలో ఏ ప్రకృతి ఆశ్రమంలో చేరండి. అసలు ప్రకృతి ఆశ్రమం లో చేరడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే, మనుషులకి ఈ రోజుల్లో ఎక్కువగా జీవనశైలి సరిగ్గా లేక జబ్బులు వస్తున్నాయి. ఆ జీవన శైలి వ్యాధులే ఎక్కువ అయిపోతున్నాయి రోజుల్లో, పూర్వం రోజుల్లో కాస్త కలరా,మసూచకం, అంటు వ్యాధులు ఇతర రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చో చనిపోయేవారు కానీ ఈ రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు ఎక్కువ మంది బాధపడుతున్నారు. మరి ఇలాంటి వాటికి ప్రకృతి ఆశ్రమాలకు వెళితే మీకు జీవన విధానాన్ని ట్రైనింగ్ ఇస్తారు.

ఇందులో చక్కగా ఫస్ట్ మీకు తెల్లవారుజామున లేచే ఒక సంస్కృతి దానివల్ల కలిగే మేలు అలవాటు చేస్తారు. నాలుగున్నర ఐదు గంటలకు ప్రకృతి ఆశ్రమంలో లేపడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. మీరు హాస్పటల్లో కనుక చేరినట్లైతే తెల్లవారుజామున ఎవరు లేపరు కదా కానీ ఇక్కడ కంపల్సరిగా లేవాల్సి ఉంటుంది, ఇక్కడ ప్రకృతి ఆశ్రమంలో 15 రోజులు 20 రోజులు నెలరోజుల పాటు ఉన్నప్పుడు ఇది ఒక హాబిట్ అయ్యి ఎర్లీగా లేస్తే ఎన్ని లాభాలు తెలుస్తాయి పడుకోవడం అనేది కూడా అలవాటు చేస్తారు. పగలంతా అలసిపోతారు కాబట్టి మసాజ్ ల వల్ల కూడా రిలాక్స్ అయ్యి తొందరగా నిద్ర వస్తుంది. అలాగే ఎర్లీగా ఫుడ్ పెడతారు కాబట్టి నిద్ర తొందరగా వస్తుంది. దీనివల్ల ఒక లైఫ్ స్టైల్ సెట్ అవ్వడానికి మీరు ఏ మంచి పని చేయాలన్నా ముందుగా ఎర్లీగా లేస్తే మంచి ఆలోచనలు వస్తాయి.

అలాగే ఎర్లీగా పడుకున్నప్పుడు బాగా గాఢ నిద్ర పట్టి బాగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ యోగ ఎక్ససైజ్ మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక రెండవది యోగ ప్రాణాయామంలో చక్కగా ట్రైనింగ్ అవుతారు, నాచురోపతి డాక్టర్స్ ఐదున్నర సంవత్సరాలు యోగ ప్రాణాయామం గురించి రకరకాల ఎక్సర్సైజ్ ల గురించి చదువుతారు. ఇది మీ తత్వానికి మీ శరీరానికి మీకు ఉన్న జబ్బులకి మీకు ఉన్న నొప్పులకి ఏం చేయాలి ,ఏం చేయకూడదు, ఏం చేస్తే ఇలాంటి సమస్య నుండి మీరు బయటపడతారు నేర్చుకోవచ్చు. మెడ నొప్పులు ,నడుము నొప్పులు, సయాటిక్ పెయిన్ ఇలాంటి సమస్యలు ఉంటే ఇది ఎలా తగ్గించుకోవచ్చో తెలుస్తుంది, ఎలా రాకుండా చేసుకోవచ్చు తెలుస్తుంది కాబట్టి వీటిని మీరు నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పులు లేకుండా అనుభవజ్ఞుల చేత నేర్పించే యోగా మాస్టర్లు చాలా చోట్ల ఉంటారు కానీ నాచురోపతి డాక్టర్స్ పర్యవేక్షణలో అయితే ఇది ఇంకా మరి మంచిది.

ఇక మూడవది అసలు ఏం తినాలి? ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు ఎలా తినాలి ఇవన్నీ కూడా నాచురల్ క్యూర్ లో నేర్పిస్తారు. మనకి ప్రధానంగా ఆహారంలోని ఏది పడితే అది ఎలా పడితే అలా తినేయడం ఒక అలవాటుగా ఉంది, కానీ ఉదయం పూట 11 లోపు తినకుండా కాస్త తేనీళ్లు జ్యూస్లు తాగి ఉండడం న్యాచురల్ క్యూర్ లో నేర్పుతారు, 11 గంటలకు డైట్ లంచ్ తినడం నేర్పిస్తారు, ఈ లంచ్ లో కూడా కర్రీస్ 300 ,-400 గ్రాముల కూరలు తినడం, రైస్ పెట్టకుండా పుల్కాలలో కర్రీస్ తినడం కడుపునిండా కూర తినడం నేర్పుతారు. తర్వాత బట్టర్ మిల్క్ కానీ కాడు కానీ కొద్దిగా అలాగే రైస్ కావాల్సి వస్తే కొద్దిగా ఇస్తారు, నాచురల్ క్యూర్ లో ఉండడం వల్ల ఇలాంటి మంచి హ్యాబిట్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. దీన్ని ఒక పది పదిహేను రోజులు అలా తినడం వల్ల ఇది ఒక హ్యాబిట్గా మారిపోతుంది.