కన్నీరు పెట్టిస్తున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ నోట్!

హైదరాబాద్ లోని నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సాత్విక్ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థి రాసిన లెటర్ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. హైదరాబాద్ నగరంలోని నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి పదిన్నర సమయంలో క్లాస్ రూమ్ లో ఉరి వేసుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమారుడు మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాలేజీలో ఒత్తిడి వల్లే స్వాతిక్ ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

తమ స్నేహితుడి ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. అయితే తాజాగా సాత్విక్ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. అమ్మానాన్న నన్ను క్షమిచండి అంటూ స్వాతిక్ రాసిన ఆ నోట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. అతడి సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కేలా చేసింది.” అమ్మానాన్న నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నన్ను కృష్ణారెడ్డి, ఆచార్య శోభన్, నరేశ్ వేధించారు. వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోయా.

హాస్టల్ లో ఉండే విద్యార్థులకు నరకం చూపించారు. వారిపై యాక్షన్ తీసుకోండి. అమ్మానాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్” అని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక అసలు ఏం జరిగిదంటే.. హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు మంగళవారం రాత్రి పదిన్నర సమయంలో తరగతి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాత్వి కోసం తోటి విద్యార్థులు చాలా సమయం పాటు వెతికారు. చివరకుఓ క్లాస్ రూమ్ లో ఊరేసుకుని కనిపించాడు. అయితే అతడి ఆస్పత్రికి తరలించేందుకు కాలేజీ సిబ్బంది ఎవరూ రాలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

కేవలం ఇద్దరు మాత్రమే బైక్ పై సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లామని తోటి విద్యార్థులు అంటున్నారు.అలానే లెక్చరర్స్ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్నేహితులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, విద్యార్థులు కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. సాత్విక్ ను లెక్చరర్లు పదే పదే ఫెయిల్యూర్ అనేవారని.. అందరి ముందు కొట్టేవారని.. ఆ అవమానం తట్టుకోలేక బలవన్మరణం చేసుకుని ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సాత్విక్ రాసినట్లు బయటకు వచ్చిన సూసైడ్ నోట్ అందరికి కన్నీరు పెట్టిస్తుంది. మరి.. సాత్విక్ రాసినట్లు వైరల్ అవుతున్న సూసైడ్ నోట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.