కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే …

కాళ్ళ పగుళ్లు కొందరిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి, మరికొందరిలో అయితే రక్తం కూడా వస్తూ ఉంటుంది, ఇలా కాళ్ల పగుళ్ళతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు కాళ్లు అయినా, శరీరం అయినా , పెదవులు అయినా ఏవైనా సరే బయటి వాతావరణానికి శరీర ఉష్ణోగ్రత కి మధ్య తేడా ఉండడం వల్లనే ఈ పగుళ్ళు వస్తూ ఉంటాయి. సాధారణంగా మనకు ఎప్పుడైనా కాళ్ళపగుళ్ళు వచ్చినప్పుడు ఆయింట్మెంట్ లాంటిది వాడుతూ ఉంటాం. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏమి చెప్తారు అంటే బయటి వైపు కాకుండా శరీర లోపలికి కూడా మందు తీసుకోవాలి అని చెప్తారు. శరీరంలో ఉన్న ఉష్ణం బయట ఉండేటటువంటి చలి ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేనప్పుడు కాళ్ల పగుళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ కాళ్ళ పగుళ్లు అనేవి ఎక్కువగా ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా పొడి తనం ఉంటుంది.

వాతావరణంలో తేమ ఉన్నప్పుడు కాళ్ళ పగుళ్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి. సరిగ్గా ఇప్పటి వాతావరణం లో తేమ అంతా హరించుకుపోతుంది, శిశు రుతువులో ఉండే చలికి వాతావరణం లో ఉన్న ప్రేమ తేమ అంతా పోయి నేల పగలడం మొదలవుతుంది, శరీరం పగలడం మొదలవుతుంది అలాగే కాళ్ళు కూడా పగులుతాయి. శరీరం కన్నా కాళ్లు పగలడానికి ఎక్కువ కారణం ఏమిటంటే కింద ఎక్కువగా నడపడం వల్ల దుమ్ము అనేది తడిని పీల్చుకుంటుంది, శరీరం మీద కన్న కాలుకు ఎక్కువగా దుమ్ము అంటుకుంటుంది. ఇలా దుమ్ము అంటుకోవడం వల్ల కాళ్లకు ఉండే కాస్త తేమ ఆ దుమ్ము పీల్చుకుంటుంది, అందువల్ల కాళ్ళు పగుళ్ళు వస్తాయి. వీలైనంతవరకూ ఊ పొడి వాతావరణం లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి.

ఈ కాళ్ళ పగుళ్లు అనేది ఆడవాళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆడవారు ఎక్కువగా తడిలో తిరుగుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కువ తడిలో ఉండి ఒక్కసారిగా అవి పొడిగా అయ్యే సరికి ఆ పైన ఉండే కాస్త చమురు లాంటి పదార్థం కూడా పోయి వాతావరణం లో ఉన్నటువంటి పొడి తనానికి కాళ్లు పగులుతాయి ఇది అసలైన కారణం. దీనికి పూర్వకాలంలో కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఆముదం రాసుకునేవారు. కానీ ఈ రోజుల్లో నూనెను తలకు పెట్టడం మానేశారు. శ్రేష్టమైన నువ్వుల నూనెను కాళ్ల పగుళ్ళకు రాసుకుంటే మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఒక రెండు నుండి మూడు చుక్కల వరకు నువ్వుల నూనెను తీసుకొని కాళ్ళ పగుళ్లు దగ్గర రాసుకుని కాళ్ళకి పాత సాక్స్ వేసుకోవడం వల్ల ఆ నూనెను లోపలికి ఇంకే టట్లు చేస్తుంది, అలాగే బెడ్ షీట్స్ కి కూడా ఆయిల్ అంటకుండా ఉంటుంది. అందువల్ల కాలు మెత్తబడుతుంది, ఇలా కాలు మెత్తబడినప్పుడు మెల్లగా కాళ్ళ పగుళ్లు తగ్గడం మొదలవుతుంది.