కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఇదేనా.. డాక్ట‌ర్స్ చెప్పిన నిజం ఇదే..!

టాలీవుడ్, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, ఈ రోజు తెల్ల‌వారుఝామున‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్, సినీ లోకం ఎంతో ఆవేదన చెందుతోంది. కైకాల మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని టాలీవుడ్, సీనియర్ నటులు చెప్పుకొచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, సహా నటీనటులంతా కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 60 ఏళ్లు సినిమాల‌లోనే ఉన్న కైకాల దాదాపు 777 సినిమాలు చేశారు.

అద్భుతమైన నటన, విలక్షణ పాత్రలతో సినీ పరిశ్రమకు పేరు తెచ్చిన నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు కాగా, ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశ‌యోక్తి కాదు .తనదైన విలక్షణ నటనతో అన్ని వర్గాల ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న కైకాల ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. . 1960 ఏప్రిల్‌ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదగుతూ వ‌చ్చారు. హీరోగా, విల‌న్‌గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించారు.

కైకాల సత్యనారాయణ మరణానికి అస‌లు కార‌ణం ఇదా?

ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే చెల్లింది. కొంత కాలంగా కైకాల అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఓ సారి క‌రోనా బారిన కూడా ప‌డ్డారు. గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి ఆయ‌న క‌న్నుమూసాడంటూ ప్ర‌చారాలు కూడా చేశారు అయితే దాదాపు ఆరు నెలల నుండి ఇంట్లోనే శస్త్ర చికిత్స చేయించుకుంటున్నా కైకాల ఈ రోజు తెల్ల‌వారుఝామున క‌న్నుమూసారు. వ‌యోభారంతో పాటు ఈ కాలంలో కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్ల‌మ్ త‌లెత్త‌డం వ‌ల్ల‌నే కైకాల క‌న్నుమూసినట్టు చెబుతున్నారు. చివ‌రిగా కైకాల మ‌హర్షి సినిమాలో పూజా హెగ్డేకి తాత‌య్య‌గా క‌నిపించారు.