చెస్ట్ పెయిన్ ,హార్ట్ ఎటాక్ తేడా….

ఈరోజు మనం మాట్లాడుకో పోయేది చెస్ట్ పెయిన్ మరియు హార్ట్ ఎటాక్ గురించి, ఈ రోజుల్లో ప్రజలు కొద్దిగా చెస్ట్ పెయిన్ వచ్చినా సరే ఎక్కడ హార్ట్ ఎటాక్ వస్తుందో అని భయపడి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను పిలిపించి కార్పోరేట్ హాస్పిటల్ వరకు వెళ్తారు.హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత హార్ట్ ఎటాక్ సంబంధించిన కార్డియాలజిస్ట్ వచ్చి అన్ని టెస్టులు చేస్తారు, తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటే మీ అదృష్టం బాగుంది అంటే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి చెస్ట్ పెయిన్ కూడా హార్ట్ ఎటాక్ కాదు.ప్రతి చెస్ట్ పెయిన్ అనేది గ్యాస్ పెయిన్ కాదు, కొంతమంది గ్యాస్ పెయిన్ అని ఈనో త్రాగడం, టాబ్లెట్ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. హార్ట్ ఎటాక్ అనేది ఎవరికి వస్తుంది అంటే, ఫ్యామిలీలో బీపీ ,షుగర్,హార్ట్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులో లో తల్లి తండ్రి కానీ బాబాయ్ కానీ.

మామయ్యలు కానీ చిన్న వయసులో పోతే అది సస్పెక్ట్ చేయవచ్చు. ఇలా కాకుండా 25 నుండి 30 వయస్సు గల వారికి చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ ఎటాక్ అని భయపడి వెళ్లక్కర్లేదు. హార్ట్ ఎటాక్ అవునో కాదో చెప్పడానికి ఆ భయం చాలదు, ఎందుకంటే వైఫ్ ఉద్యోగం చేయట్లేదు, పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, ఇలాంటి ఆలోచనలకు గురి అయినప్పుడు భయం వస్తుంది, తర్వాత చెమట వస్తుంది, ఇలా చెమట వచ్చినప్పుడు హార్ట్ ఎటాక్ అని అందరూ అనుకుంటారు. అందువల్ల గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే హార్ట్ ఎటాక్ కేసుల్లో 60 శాతం అసలు వారికి తెలియదు సడన్ గా ఎక్కడ ఉన్నా సరే చనిపోతారు, ఇలా 60 శాతంవరకు జరుగుతుంది,20 శాతం హార్ట్ ఎటాక్ కేసులు ఏమిటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేదా దగ్గరలో వేరే హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వాళ్ళు అబ్సర్వేషన్ లో పెడతారు, అక్కడ వాళ్ళు మందులు , ట్రీట్మెంట్ మొదలుపెడతారు.

మిగతా ట్వంటీ పర్సెంట్ ఊర్లో ఉండే వాళ్ళు కానీ హాస్పిటల్ కి దూరంగా ఉండే వాళ్ళు కానీ హాస్పటల్లో చేర లేకపోతే వాళ్లు కార్ లో పడుకొని ఒక గ్లాస్ మజ్జిగ తాగి, లేదా మంచి నీళ్లు త్రాగి రెస్ట్ తీసుకుంటారు, దీంట్లో ఆ మూడవ కోవకు చెందిన వారికి ఛాన్సెస్ బాగుంటుంది. హార్ట్ ఎటాక్ హార్ట్ ఎటాక్ అనేది ఎక్సలెంట్ చెస్ట్ యొక్క మధ్య భాగంలో వస్తుంది, కొంతమంది లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చిందండి అది హార్ట్ ఎటాక్ అనుకున్నాను అంటూ ఉంటారు,ఇది కరెక్ట్ కాదు. హార్ట్ పెయిన్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంది, ఒకటి మధ్యలో పిసికినట్లు వస్తుంది, ఒకటి గొంతు దగ్గర ఎవరో నొక్కుతున్న ట్లు ఫీలింగ్ వస్తుంది, దీంతోపాటు ఎడమ చేయి లోపలి వైపు వస్తూ ఉంటుంది, అదికూడా ఫిజికల్ గా ఎక్ససైజ్ చేసినప్పుడు, ఇది హార్ట్ పెయిన్ కి సంకేతం వెంటనే మీ ఫిజిషియన్ డాక్టర్ని కలిసి ECG తీయాలి , వాటికి సంబంధించిన జాగ్రత్తలను వారు చెబుతారు.