జస్ట్ 15 డేస్ జామ ఆకుతో ఇలా చేయండి చాలు ఒత్తుగా మెత్తటి జుట్టు….

వెంట్రుకలు ఊడిపోకుండా జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే తల భాగంలో ఉండే చర్మంలో కొలాజిన్ అనేది లోపలి పొరలో ఉంటుంది, ఈ కొలాజెన్ మెష్ అనేది హెల్దీగా ఉంటే జుట్టు ఊడిపోకుండా ఈకొలాజెన్ వెంట్రుకలను బాగా బలంగా పట్టి ఉంచుతుంది. మనం ఇంతకు ముందే కొలాజిన్ గురించి తెలుసుకోవడం జరిగింది. స్ట్రెచ్ మార్క్స్ వచ్చేటప్పుడు చర్మం లోపల ఉండే పొరలో కొలాజిన్ ఎలాస్ట్రిన్ తో కూడిన మెష్ అనేది పగిలిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఈ మెష్ పిగిలిపోవడం వల్లనే ముసలితనంలో కూడా చర్మం ముడతలు పడటానికి ఈ మెష్ దెబ్బతినడమే కారణం.

ఏజ్ పెరిగే సరికి ఆ కొలాజిన్ దెబ్బతినడం అనేది సహజంగా అందరిలో జరుగుతుంది దాన్ని మనం ఆపలేము. కానీ తలలో ఉండే చర్మం లో ముఖ్యంగా ఆ లోపలి పొరలో ఉండే కొలాజిన్ కనుక దెబ్బ తిన్నట్లయితే జుట్టు కుదుళ్ళు బలహీనo అయిపోతాయి. తద్వారా జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది.మామూలుగా జుట్టును దువ్విన సరే ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఆ కొలాజిన్ కనుక బాగా ఫామ్ అయి జుట్టు కుదుళ్లను బాగా పట్టి ఉంచినట్లయితే, జుట్టు కుదుళ్లు దృఢంగా బలంగా ఉంటే జుట్టు ఊడిపోకుండా రక్షించుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. ఈ కొలాజిన్ ను హెల్తీ గా చేయడానికి బాగా పెంచడానికి ఉపయోగపడే విధంగా జామ ఆకులు జుట్టుకి కొలాజిన్ ను పెంచుతాయని సైంటిఫిక్ నిరూపించబడింది.

జామ ఆకు లో ఉండే విటమిన్ సి, జామ ఆకు లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండిటి కలయిక వల్ల జుట్టు కుదుళ్ల లో కొలాజిన్ ప్రొడక్షన్ బాగా పెంచి జుట్టు కుదుళ్లకు బాగా పట్టి ఉంచేలా చేస్తుంది, వేర్లు బాగా బలంగా నేల లోకి చొచ్చుకొని పోతే మొక్క బాగా దృఢంగా అవుతుంది. అదేవిధంగా కొలాజిన్ మెష్ బాగా హెల్దీగా తయారైతే జుట్టు కుదుళ్లకు బలం పెరుగుతుంది.ఆ రకంగా ఈ జామ ఆకులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని చెప్పబడింది. అలాగే జామాకు లో ఉండే లైకోపిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ మోతాదులో ఉండడంవల్ల ఎండ యొక్క యు వి కిరణాల నుండి జుట్టును రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అల్ట్రా వైలెట్ రేస్ మనకి జుట్టు మీద పడే సరికి జుట్టు ఎరుపెక్కడం, జుట్టు చివర్లో చిట్లిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలా UV కిరణాల నుండి జుట్టును కాపాడడానికి జామాకులు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పడం జరిగింది.

ఇలా రెండు రకాల ప్రయోజనాలను జామాకులు జుట్టుకు ఇస్తున్నాయి, జామ ఆకుల పేస్ట్ని కూడా వాడుకోవచ్చు. లేతగా ఉన్న జామ ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, వడకట్టి వాటర్ ని జుట్టు భాగానికి బాగా పట్టించాలి, ఇలా పది నుండి పదిహేను నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా జామాకులను నీళ్లలో వేసి మరిగించి, మరిగిన తర్వాత గోరువెచ్చగా చల్లార్చి, రసాన్ని వడకట్టి ఆకులను తీసేయాలి, ఇలా వచ్చిన డికాషన్ కూడా జుట్టుకు పట్టించాలి, ఇలా చేసినప్పటికీ కూడా ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ బాగా జుట్టు పెరుగుదలను బలపరచడానికి ఉపయోగపడతాయి.