టన్నుల కొద్దీ బలం దీనితో మాత్రమే సాధ్యం….

ప్రకృతి మనకు ఇచ్చిన ఒక చక్కటి గొప్ప ఆహారాలలో అతి ముఖ్యమైన ఆహారం పచ్చికొబ్బరి. కొబ్బరి మన తెలివితేటలకు, మేధాశక్తికి బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ కి ,జీవితకాలం మతిమరుపు రాకుండా చాలా చురుగ్గా మెదడు కణాలు పని చేయడానికి కొబ్బరికి మించిన మంచి కొవ్వు మరొకటి లేదని చెప్పవచ్చు. కొబ్బరి అంత ఉపయోగం కాబట్టే మన పెద్దలు అన్నిటిలోనూ కొబ్బరికాయకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. శుభకార్యాలు జరిగినా ఏ పని ప్రారంభించాలన్నా పూజల సమయంలో, నోముల సమయంలో, చివరకు పెళ్లి చేసేటప్పుడు కూడా చేతిలో కొబ్బరిబోండం పెట్టి చేశారు కానీ మరి ఏదో చేయలేదు కదా. మరి అలాంటి కొబ్బరికాయ ను మనం ఏ ఏ రూపాలలో ఎలా వాడుకుంటే బావుంటుందో మనకు తెలుసు. ఈ రోజు స్పెషల్ గా లేత కొబ్బరి బోండాలో నుండి లేత కొబ్బరి యొక్క పాలను ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరికి ఈ పాలను పడితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం!

కొబ్బరి బొండాలలో మనం నీరు తాగిన తర్వాత ఒక్కొక్కసారి కొబ్బరి మందంగా కట్టి ఉంటుంది. ఇలాంటి మందంగా కట్టిన లేత కొబ్బరిని మీకు లభించినప్పుడు వాటిని పాలను చేసుకుని తాగితే చాలా చాలా బాగుంటుంది. అందులోకి మనం మనం కొన్ని నీళ్లు కలిపి లేదా కొబ్బరి నీళ్లు కలిపి ఆ కొబ్బరిని గ్రైండ్ చేసి పాలన మెత్తగా తయారుచేసుకుని అవసరం అనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి ఇది అచ్చం పాలలాగే ఈ కొబ్బరి పాలు తయారు అవుతాయి. ఈ కొబ్బరి పాలు ఎక్కువ కావాలి అంటే కొబ్బరి బోండాలు కొట్టే వ్యక్తి దగ్గర చాలామంది నీళ్ళు తాగేసి వెళ్ళి పోతూ ఉంటారు అందరికీ అంత సమయం ఉండదు అతనికి కూడా అస్తమానం బోండా లను కొడుతూ ఉండడంవల్ల టైం వేస్ట్ అని అలాగే పక్కన పడేస్తూ ఉంటాడు. ఆ కొబ్బరి బొండాల లో కాస్త నరికే అప్పుడే తెలుస్తుంది కొబ్బరి ఎందులో ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఆ కొబ్బరి ఎవరు స్ట్రా వేసుకుని త్రాగిన మనకు ఏమీ ఇబ్బంది ఉండదు, ఇలా ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.

చక్కగా నీళ్ళు తాగేసి వదిలేసినా కొబ్బరి బొండం 3, 4 బోండాలను కొట్టించి కొబ్బరిని తీసుకుని దాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పాలను తీసుకుని వాటిని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ పాలతో ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు రానప్పుడు తల్లిపాలకు సమానంగా ఈ లేత కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. రకరకాలుగా ఫార్ములా ల తో తయారుచేసిన ఫార్ములా మిల్స్ ఉంటాయి కదా, పౌడర్స్ కలుపుకుని తాగే అలాంటి మిల్క్ కంటే కూడా, ఇది చాలా బెటర్. ఈ ఫార్ములా పాలు త్రాగడం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, బరువు పెరుగుతారు అంత మంచిది కాదు, చిన్నప్పటి నుండే అలాంటివి మొదలు పెడుతున్నారు ఈ రోజుల్లో. కానీ ఇలాంటి పాలు చాలా హెల్ప్ చేస్తాయి, అందుకని వీటిలో కాస్త తేనె కలిపి పట్టండి చాలా తేలికగా డైజేషన్ అవుతాయి. దీనిలో మంచిగా డైజేషన్ అయ్యే కొవ్వులు ఉంటాయి, రుచి కూడా బాగుంటుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…