తారకరత్నకు Jr.NTR ఆర్థిక సాయం.. ‘తమ్ముడు లేకపోతే నా కుటుంబం ఇలా ఉండేది కాదు’!

నందమూరి తారకరత్నకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న జూనియర్‌ ఎన్టీఆర్‌తో తనకు గల అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..నందమూరిక తారకరత్న మృతితో వారి కుటుంబంలోనే కాక.. టీడీపీ, ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరకు అనంత లోకాలకు వెళ్లారు. తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు, నందమూరి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సినిమాలు, రాజకీయాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో ఆయన భార్యాబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తారాకరత్న-జూనియర్‌ ఎన్టీఆర్‌ మధ్య ఎంత బలమైన అనుబంధం ఉందో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో జూనియర్‌ తారకరత్నకు ఆర్థిక సాయం చేశారంట. ఆ వివరాలు..జూనియ‌ర్ ఎన్టీఆర్‌, తార‌క‌ర‌త్న ఇద్ద‌రూ నంద‌మూరి హీరోలే. నందమూరి వారసులుగా ఇద్దరు దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్‌ ప్రారంభంలో వీరిద్ద‌రూ మ‌ధ్య విపరీతమైన పోటీ న‌డిచింద‌నే వార్త‌లు అప్పట్లో బలంగా వినిపించేవి. అయితే ఇవన్ని వట్టి పుకార్లే అని తారకరత్న కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.. ఎన్టీఆర్ కంటే తార‌క‌ర‌త్న పెద్ద‌వాడు.

అలాగే తార‌క‌రత్న‌ హీరోగా ఎంట్రీ ఇచ్చే స‌మ‌యానికి జూనియ‌ర్ ఎంట్రీ ఇవ్వ‌ట‌మే కాదు.. ఆది సినిమాతో స్టార్ హీరో ఇమేజ్‌ను వ‌చ్చేసింది. ఇదే విష‌యాన్ని తార‌క‌రత్న ఇంట‌ర్వ్యూస్‌లో చెప్పి.. తాను తమ్ముడితో ఎప్పుడు పోటీ పడలేదని వెల్లడించారు. అంతేకాక జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబానికి చేసిన సాయాన్ని వెల్లడించారు తారకరత్న.తారకరత్న లవ్‌ మారేజ్‌ చేసుకున్న సంగతి తెలిపిందే. విజయసాయి రెడ్డి బంధువు అలేఖ్యా రెడ్డిని తార‌క‌ర‌త్న ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమెకు వివాహమయ్యి విడాకులు తీసుకున్నారు. దాంతో తారకరత్న కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. అయితే పెద్ద‌లు వ‌ద్ద‌న్నా సరే వారు పెళ్లి చేసుకోవ‌టంతో కుటుంబ స‌భ్యులు కొన్నాళ్లు తార‌క‌ర‌త్న‌తో మాట్లాడ‌లేదు.ఆ స‌మ‌యంలో ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి.

అలాంటి సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తారకరత్నకు ఆర్థిక సాయం చేశారట. నాలుగు లక్షల రూపాయలు తారకరత్నకు పంపారట జూనియర్‌. అయితే దీని గురించి తారకతన్న పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ఈ రోజు మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణం ఎన్టీఆర్‌. నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు నాకు అండగా నిలిచాడు’’ అని చెప్పుకొచ్చారు. తారకరత్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలారు. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.