తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు.నందమూరి తారకరత్న మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం అంటే బాధ ఉంటుంది. నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం నాడు మృతి చెందారు. ఈ 23 రోజులు తారకరత్న కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించారు.

ఈరోజు ఇంటికి వచ్చేస్తాడు నా భర్త అని తారకరత్న భార్య, తమ తండ్రి ఇంటికి వచ్చి తమతో ఆడుకుంటారని పిల్లలు ఎంతగానో ఎదురుచూసి ఉంటారు. ఈ 23 రోజులూ వాళ్లకి 23 యుగాలుగా గడిచి ఉంటాయి. కానీ ఆయనకేమీ కాదు, తిరిగొస్తాడులే అని అనుకున్న వారి ఆశల మీద నీళ్లు చల్లేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఉన్నారు. బెంగళూరు నుంచి ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడమే మానేశారు.

దీంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. భర్త చనిపోయాడన్న బాధలో కుమిలిపోతున్నారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె నిరసించారు. ఉదయం నుంచి ఆమె ఏడుస్తూనే ఉన్నారు. తారకరత్న లేడన్న వార్త అబద్ధమైతే బాగుండునని ఆమె కోరుకుంది. శనివారం రాత్రి నుంచి ఆమె ఆహారం తీసుకోలేదు. దీంతో ఆమె బాగా నీరసించిపోయారు. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.