తొలిరోజు జరిగిన ఆ తప్పే.. తారకరత్న ప్రాణాలు పోవడానికి కారణమా?

గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అదేరోజు గుండెపోటుతో కుప్పకూలడంతో పాటు అప్పటికప్పుడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.నందమూరి తారకరత్న మరణవార్త సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అదేరోజు గుండెపోటుతో కుప్పకూలడంతో పాటు అప్పటికప్పుడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే మెరుగైన చికిత్స కోసం తారకరత్నని హుటాహుటిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. అప్పటినుండి తారకరత్న హెల్త్ కండిషన్ క్రిటికల్ గానే ఉంది. ఇక హాస్పిటల్ లో చేరిన తొలి రోజునుండి చివరి శ్వాస విడిచే వరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగు కనిపించకపోవడంతో వైద్యులు అహర్నిశలు ప్రయత్నించారు. అంతేగాక తారకరత్న కోసం విదేశాల నుండి స్పెషలిస్ట్ లను సైతం పిలిపించారు. విదేశీ వైద్యుల రాకతో నందమూరి ఫ్యాన్స్ లో కాస్త ఆశలు మొదలైనప్పటికీ.. శనివారం రోజు తారకరత్న కన్ను మూశాడని తెలియడంతో ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో తారకరత్న ఇక లేడనే వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. 23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు శాయశక్తులా ప్రయత్నించి కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి మొదటి రోజు తప్పే కారణమా?

అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జనరల్ గా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి సీపీఆర్ అనేది నిమిషాల్లోనే చేయాలి. కానీ.. తారకరత్న విషయంలో సీపీఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేశారు. సీపీఆర్ అందాల్సిన టైంలో కాకుండా తారకరత్నకి లేట్ గా చేశారు. దానివల్ల హార్ట్ హొల్స్ లో బ్లడ్ క్లోట్ అయిపోయి.. బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడం వల్లే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారింది. ఒకవేళ సరైన టైంలో సీపీఆర్ చేసి ఉంటే.. తారకరత్న పరిస్థితి ముందునుండే ఇంత సీరియస్ గా ఉండేది కాదేమో.. మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్స్ కి మరింత ఎక్కువ అవకాశాలు ఉండేవేమో అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మొదటి రోజు జరిగిన ఆ ఒక్క తప్పు వల్లే తారకరత్న పరిస్థితి ప్రాణాపాయంగా మారిందని అంటున్నారు.