దసరాలోపు ఈ వీడియో ఒక్కసారి చూడండి…

ఈ అక్టోబర్ 5వ తేదీన దసరా రాబోతుంది అయితే హిందువుల ముఖ్యమైన పండుగలలో దసరా అతి ముఖ్యమైనది. పది రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు అని పదవరోజు విజయదశమితో కలిపి దసరా అని అంటారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తూ ఉంటారు, చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి పండుగను జరుపుకుంటారు. అయితే ఎవరైతే ఈ దసరా రోజున ఈ కథను విన్న చదివిన చెప్పిన సకల పాపాలు తొలగిపోయి అమ్మవారి కృప కటాక్షంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇప్పుడు మనం ఈ పురాణ కథను తెలుసుకుందాం. రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు. అయితే ఒకనాడు మహిషాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరుతాడు.

అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో వారు తనను ఎలా సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరుకున్నాడు. అందుకు బ్రహ్మ అంగీకరించి వరం ఇస్తాడు దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందని గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. మహిషాసురుని చేతిలో పరాధితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని కైలాసం చేరుకుని పరమేశ్వరుని కి నమస్కరిస్తారు. పరమేశ్వరం కూడా దేవతలందరి యోగక్షేమాలు విచారించిన తర్వాత వారి ఆగమన కాలం అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహాదేవ ఈ ఇంద్రాది దేవతలు రాక్షసుడి వల్ల స్వర్గ పాద బ్రష్టులై అడవుల తిరుగుతూ నానా కష్టాలు పడుతున్నారు. ఈ విషయం మీకు తెలియంది కాదు, నీవు సర్వ సమర్ధుడవు నీవే దేవతలను కాపాడాలి అన్నాడు అప్పుడు శివుడు పక్కపక్క నవ్వి ఇది మరీ బాగుంది మహీషుడు కోరిన వరాలు ఇచ్చి దేవతలను కష్టాలకు గురిచేసింది.

నువ్వు ,వారిని కాపాడాల్సింది నేన,నేను మాత్రం ఏం చేయను మహీశుడిని చంపడానికి నేనేమీ స్త్రీని కాదే పోనీ నీ భార్యకు నా భార్యకు యుద్ధం చేసే శక్తి ఉందా అంటే అది లేదు. అయినా మహావిష్ణువును వదిలి మనమందరం సమాలోచన చేయడం మర్యాద కాదు శ్రీహరి కార్యసాధకుడు , మహా మేధావి మనమంతా కలిసి వెళ్లి శ్రీహరిని సలహా అడుగుదాం ఆయన చెప్పినట్లు చేద్దాం రండి అని అన్నాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్లి శేషశైనుడైన శ్రీహరికి నమస్కరించారు. శ్రీహరి వారికి స్వాగతం చెప్పి ఉచిత ఆసనాలు ఇచ్చి గౌరవించి కుశలం అడిగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు తమ తమ కష్టాలు శ్రీహరికి విన్నవించుకుని కాపాడమని ప్రార్థించారు, అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి ఒకసారి మనమంతా కలిసి మహీషునీతో యుద్ధం చేసి వాడిని గెలవలేక యుద్ధరంగం వదిలి వచ్చేసాం కనుక వాడిని మనం గెలవలేము. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాను సారం మహేశుడు స్త్రీ చేతిలోనే మరణిస్తాడు.