దుంపల్లో నెంబర్ వన్ షుగర్ రాకుండా ఒళ్ళు నొప్పులు అసలు రాకుండా…

దుంపల్లో బంగాళాదుంప నెంబర్ వన్ అని చెప్పవచ్చు, అసలు బంగాళాదుంప ఐటమ్స్ ని ఇష్టపడని వారు సహజంగా కనబడరు. మన తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియాలోనే వరల్డ్ లోనే ఎక్కడైనా విపరీతంగా వాడుతూ ఉంటారు. రుచిగా ఉందని బంగాళదుంపను తినడం వల్ల పెద్ద ఎక్కువ నష్టం ఉండదు. కానీ వంట తయారు చేసే తీరు వల్ల నష్టం జరుగుతుంది. సైంటిఫిక్ గా 70,000 మంది మీద బంగాళదుంపను ఎలా తింటే షుగర్ రాకుండా ఉంటుంది, ఎలా తింటే షుగర్ 25 శాతం మందికి వచ్చేసింది అనేది 70,000 మంది మీద వచ్చిన విషయాన్ని 2016 వ సంవత్సరంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ యూఎస్ఏ వారు వాళ్ళలోనే బెస్ట్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధన ఇది.

ఇంతమందికి సుమారుగా నాలుగేళ్ల పాటు రోజు బంగాళదుంపలను ఉడకపెట్టి ఇచ్చారు, వారానికి మూడుసార్లు ఇలా ఇచ్చేవారు వీరికి డయాబెటిస్ వచ్చే శాతం 4 పర్సెంట్ మాత్రమే పెరిగింది. అదే బంగాళదుంపలను డీప్ ఫ్రై చేసి తిన్న ఫ్రెంచ్ ఫైర్స్ చేసి తిన్న, చిప్స్ రూపంలో తిన్న బంగాళదుంపలకు బాగా నూనె వేసి బాగా ఎక్కువ సేపు వేయించుకునే అలా తీసుకున్న వీరి మీద కూడా ఫోర్ ఇయర్స్ పాటు వారానికి మూడుసార్లు ఇలాంటి ఫుడ్ పెట్టి చూస్తే వీరిలో 25% షుగర్ వచ్చేసింది. వంట చేసే తీరులో బంగాళదుంప వల్ల ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి ఇలా నూనెలో వేయించడం చిప్స్ రూపంలో కానీ తీసుకోవడం వల్ల డీప్ ఫ్రై లో ఈ మెకానిజంలో కార్బోహైడ్రేట్స్ కూడా నష్టపోతాయి.

బంగాళదుంపను కూర లాగా పాలు పోసి వండుకోవడం కొన్ని వెజిటేబుల్స్ కాంబినేషన్లో బంగాళాదుంపలను వేసి వండుకోవడం వల్ల నష్టం రాదు. బంగాళదుంప తింటే డయాబెటిస్ వచ్చేస్తుంది అంటే అది సరికాదు. వీటిని మనం తింటూ పిల్లలకు పెట్టుకుంటూ వెళితే, ఈ మధ్యకాలంలో బంగాళదుంప చిప్స్ పిల్లలు విపరీతంగా తింటున్నారు, ఇది చాలా ప్రమాదం అందుచేత పిల్లలు పేచి పేట్టకుండా బాగా భోజనం చేస్తున్నారు అని ఇలా బంగాళదుంపలను కనుక డీప్ ఫ్రై చేసి రకరకాలుగా ఇవ్వడం వల్ల చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటాం. అందుకని బంగాళదుంపలను వాడుకునే తీరు వండుకునే తీరు అతి ముఖ్యం అని మరవకండి ముఖ్యంగా తల్లులందరూ తెలుసుకుంటే బాగుంటుంది.