నాగుల చవితి మీ పిల్లల కోసం యిది వినండి….

ఒకానొకప్పుడు పాతాళ లింగం దగ్గర, మళ్లీ ఆ పాతాళ లింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ దేవాలయాన్నంతటినీ కూడా పునర్నిర్మానం చేశారు. తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు. ఎలాగో భగవాన్ దర్శనానికి వస్తారని పెద్ద చలవ పందిడ్లు వేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వేళలో రమణ మహర్షి ఒక్కరే కూర్చుని ఉండేవారు. ఒకరోజు సూర్యనాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు, వచ్చి అక్కడ కూర్చొని ఆమె ఒక మొక్క పక్కన కూర్చున్నారు, కూర్చుంటే రమణ మహర్షి చంప కింద చేయి పెట్టుకుని అలా చూస్తున్నాడు. ఆయన దేన్ని చూస్తున్నాడు అని ఆవిడ చూశారు, ఒక పెద్ద ఆకు పచ్చ పాము, అది చెట్టు తిరుగుడు పాము అది అంత విషపూరితమైనటువంటి పాము.

అది తడిగా ఉన్న మొక్కల మీద తిరిగి, పందిరి ఎక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకొని పడుకొని ఉంది. ఈవడ భగవాన్ పాము అన్నాడు అన్నది, అవును చూశాను, గత మూడు రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉన్నారు, ప్రతిరోజు రెండున్నరకి వస్తారు వారు కొంతసేపు ఇక్కడ తిరుగుతారు. తిరిగి వారు వెళ్లిపోతారు వారు ఏదో పనిమీద వస్తూ ఉంటారు ఇక్కడికి, ఎందుకో వస్తున్నారు అన్నారు. ఆవిడ తెల్లబోయారు తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒకాయన వచ్చి అవునమ్మా, రోజు ఈయన వస్తాడు ఆ పాము వస్తుంది, జన్మజన్మలెత్తిన మనకు ఆ మాట నమ్మకం రాదండి, అది అనుభవించిన వారి గుండెలించే వస్తుంది. గురువు పక్కన ఉంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా, అందుకని ఆయన చూడండి అలాంటిది పాము వస్తుంది, ఈయనేమో రోజు దాన్ని చూస్తూ ఉంటాడు, భగవాన్ పదిమంది తిరిగే ప్రదేశంలో ఈ పాము తిరుగుతుంది అంటే, పోనీలేవయ్య వారు ఎందుకు వస్తున్నారు అంటారు.

అంటే ఈవిడ అన్నారు సూర్య నాగమ్మ గారు నాకేమీ భయం వేయట్లేదు భగవాన్, ఎందుకంటే మీరు రోజు చెప్పిన మాటలు నేను వింటున్నాను, కానీ వారు చెప్పిందాంట్లో కూడా సత్యం ఉంది, అందరూ మీ స్థాయిలో ఉండరు కదా వచ్చిన వారు ఎవరైనా కంగారు పడి పాము పాము అంటే ఇబ్బంది కదా, అందుకని ఆ పాముని కొట్టేస్తే బాగుంటుంది అని ఈయన పూర్తి చేశాడు. వెంటనే రమణులు చూసి అన్నారు, అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడుతారు, ఎన్నాళ్లు చేస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని, తిత్తులు వేరు కావచ్చు కానీ లోపల పదార్థాన్ని చూడండి. వారిలో ఉన్న పదార్థం మనలో ఉన్న పదార్థం ఒక్కటే కదా, వారు ఏదో పాపం చల్లగా ఉందని వచ్చి వెళ్ళిపోతున్నారు, వారు ఎవరికి అపకారం చేశారు, వారిని ఎందుకు కొడతారు అంటారని అలా చూశారు, ఆ పాము వంక పాము ఆయన వంక చూసింది, అది నిజమైన శక్తి అది నిజమైనటువంటి అవగాహన. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.