పంచాంగం ఉగాది నుండి ఈ 2 రాశుల వారికీ ఆ నెలలో గండం పొంచి ఉంది గండం పోవాలంటే ఇలా చెయ్యండి…

ఏప్రిల్ 2వ తేదీ న నూతన సంవత్సరంలో ఉగాది ప్రారంభం కాబోతుంది, అయితే ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క కదలిక కారణంగా అనేక శుభ అశుభ ,ప్రతికూల -అనుకూల ఫలితాలు రాబోతున్నాయి.అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి 2 రాశులవారు ఏ జన్మలో ఏ పాపం చేశారు తెలియదు కానీ అనేక కష్టనష్టాలను చవి చూడబోతున్నారు.నూతన సంవత్సరంలో ఈ 2 రాశుల వారికి ఒక గండం ,ముప్పు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రెండు రాశుల వారికి ఈ గండం కారణంగా అనేక కష్టాలు, అనేక దుష్ఫలితాలు రాబోతున్నాయి.అసలు ఏ రాశుల వారు కష్టాలను ఎదుర్కొపోతున్నారు, ఈ గండం వీరికి పొంచి ఉంది అనే విషయాలు తెలుసుకుందాం!ఇందులో మొదటి రాశి ధనుస్సు రాశి, ఈ రాశి వారికి శ్రీ శుభ కృత నామ సంవత్సరంలో శుభం లేకుండా పోతుంది. గురువు సరిగ్గా లేకపోవడం, శని కూడా సమస్యలను తెచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అందువల్ల కోర్టు కేసులు, పోలీస్ కేసులు అంటూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి, మీకు ఉన్నా గండం కారణంగా అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణాల విషయంలో దుష్ప్రభావాలు ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త అవసరం డబ్బు ఖర్చు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. వివాదాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడున్న ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇవ్వకపోగా ప్రతికూల ఫలితాలను ఇవ్వపోతున్నాయి. ఏది చేసినా అందులో మీరు ఉన్నట్లయితే కచ్చితంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మీకు సంఘంలో మర్యాద, గౌరవంపోతుంది. గొంతు మరియు పొట్ట కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి, ఇవి చిన్నవిగా మొదలై పెద్ద సమస్యగా మారి మీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయవద్దు.తర్వాత రాశి మకర రాశి, ఈ రాశివారికి ఉగాది తర్వాత నుండి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ధైర్యంగా మీరు వాటిని ఎదుర్కోవాలి. ఖర్చులు అయితే కాస్త తక్కువగా ఉంటాయి కానీ అలా అవమానం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి, లారీ డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు డ్రైవింగ్ రంగం లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ ప్రమాదం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గండం తాలూకా దుష్ప్రభావాలు నీకు వాహన రూపంలో వచ్చి ఢీ కొట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం పాటు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా అదే ఉద్యోగంలో ఉండడం మంచిది, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉన్న ఉద్యోగం లో సమస్యలు తలెత్తుతాయి. మకర రాశి వారికి ఏలినాటి శని ఉండడంవల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి, విదేశీ ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, పరిస్థితి ఎలా ఉన్నా చేతిలో డబ్బు సమస్య అయితే ఉండదేమో గాని మానసికంగా, శారీరకంగా పలు అనారోగ్య సమస్యలు, పలురకాల ఇబ్బందులు, ఆలోచనలతో ఈ మకర రాశి వారికి శ్రీ శుభ కృత నామ సంవత్సరం నుండి అనేక ఆటంకాలు ఆటుపోట్లు వస్తాయి.