పళ్ళ మధ్యలో సంధులు…

ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే మిడ్ లైన్ డయాస్టిమా. మిడ్ లైన్ డయాస్టిమా అంటే ఏమిటో కాదు మన పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్. ఈ గ్యాప్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇది మాక్సిమం మనకు చిన్నప్పుడు వస్తుంది లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అలాంటి సమయంలో వస్తుంది లేదంటే మనకు అక్కడ లేబియల్ ఫ్రీనం అని ఉంటుంది.

అది ఎక్కువ ఉండడం వల్ల కూడా పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది, లేదా మన జా సైజ్ ఏదైతే ఉంటుందో, అది చాలా పెద్దగా ఉండి టీత్ అనేది చిన్నగా ఉన్నప్పుడు కూడా, టీత్ కి మధ్యలో గ్యాప్స్ రావడం వల్ల కూడా మిడ్లైన్ డయాస్టిమా వస్తుంది. దీనికి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఆర్తో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఈ ఆర్థో ట్రీట్మెంట్ అనేది వన్ , వన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు అవుతుంది. దాంట్లో మనకి చాలా చాలా రకాలు అనేవి ఉంటాయి.

కానీ మాకు అంత టైం లేదు కానీ గ్యాప్ అనేది చాలా తక్కువ రోజుల్లో క్లోజ్ అవ్వాలి అని అనుకుంటే, కంపోసిటఅని కూడా వేయించుకోవచ్చు. దీంట్లో ఏమిటంటే డ్యూరిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, మాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది, తర్వాత మళ్లీ ఆ ఫిల్లింగ్ ఏదైతే చేస్తామో అది మళ్లీ ఊడిపోతుంది. లేదా డిస్కలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల కంపోసిట్ అనేది కూడా పర్మినెంట్ కాదు లేదు అనుకుంటే వెన్యస్ కి వెళ్ళిపోవచ్చు.

దీంట్లో ఏమిటంటే పళ్ళ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని క్లోజ్ చేయడానికి వెన్యస్అనేది అమర్చడం జరుగుతుంది. కాకపోతే ఇతర ట్రీట్మెంట్స్ తో పోలిస్తే ఈ వెన్యస్ అనేది కాస్త కాస్ట్లీ ట్రీట్మెంట్. లేదు క్యాప్స్ వేయించుకుంటాము అనుకుంటే ఇది కూడా ట్రై చేయవచ్చు, క్యాప్స్ వేసుకుంటే ఏమిటంటే మనకు గ్యాప్ ఉన్న టీత్ కవర్ అయిపోతాయి, ఇలా ఫోర్ టీత్ ని కవర్ చేసి క్యాప్స్ అనేవి ఇస్తారు, ఈ క్యాప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి మనకి మన అందుబాటు ధరలోనే లభిస్తాయి.