బట్టతలపై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి

జుట్టు పాపడి వద్ద పలుచబడుతోందా? మీ మాడు పై బట్టతల ప్యాచెస్ ఏర్పడుతున్నాయా? ఒక వయసు తరువాత (వృధాప్యంలో) ఇలాంటి సమస్యలు ఏర్పడితే పెద్ద సమస్యగా అనిపించదు కానీ యవ్వనంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే! వీటితో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పబ్లిక్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని ఉత్తమ హోమ్ రెమిడీస్ ని ఉపయోగించి ఈ సమస్యను క్యూర్ చేయవచ్చు. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి? ఈ సమస్యలను ట్రీట్ చేసేందుకు ఉల్లిపాయతో తయారు చేసుకొనే ఉత్తమ హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. మరియు బట్టతల యొక్క వైద్య చికిత్సల గురించి కూడా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బట్టతల వంశపారంపర్యంగా వచ్చే సమస్య, జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని అంటారు ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల సమస్య ప్రస్తుత కాలంలో 20 ఏళ్లలోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది.మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం లాంటి విషయాలు దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని కొందరు భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా వారి వంశావళిలోని వారసులకు రావొచ్చు. తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు, కానీ ఆడవారికి కూడా వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే, ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జట్టు పలుచగా అవుతుంది.

ఉల్లిపాయ రసం ని తయారు చేసే విధానం: మీ కురులకు సరిపడేన్ని ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసి శుభ్రమైన నీళ్లతో కడగాలి ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి 2 నిమిషాల పాటు రుబ్బాలి కావల్సినంత నీళ్లను చేర్చుకొని రుబ్బుకోవచ్చు. రుబ్బిన ఉల్లిపాయలను ఫిల్టర్ లో లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలో గాని వేసి పిండితే ఉల్లిపాయ రసం రెడీ అవుతుంది. లేదా ఉల్లిపాయను గ్రేట్ చేసి వాటిని పిండి కూడా రసం తయారు చేసుకోవచ్చు. జుట్టుపై వాడేటప్పుడు ఎల్లప్పుడూ తాజా ఉల్లిపాయ రసం మాత్రమే ఉపయోగించాలి.

ఉల్లిపాయ రసం మరియు తేనె: తేనెలో అనేక ఔషధ గుణాలున్నాయని మన అందరికీ తెలిసిందే. ఇది చర్మం మరియు కేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి కూడా సహాయపడుతుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్కాల్ట్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత స్కాల్ప్ పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

Onions at Rs 30000/metric ton | Pyaz, प्याज - Mahesh Trading Co, Bengaluru  | ID: 15955596255

ఉల్లిపాయ రసం మరియు కలబంద: జుట్టు పెరుగుదలను ప్రేరేపించేందుకు మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తాజాగా తయారు చేసిన ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని కలిపి స్కాల్ప్ మరియు కురులపై రాయండి. బాగా అప్లై చేసినట్టు నిర్ధారించుకోండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాన్ని అధికరిస్తుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత మాడు పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.హెయిర్ ఫాల్ ను నియంత్రించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉల్లిపాయ రసం యొక్క సామర్ధ్యం మన అందరికీ బాగా తెలిసిందే. జుట్టు సమస్యల నుండి మీరు బాధ పడుతున్నట్లయితే పై చెప్పిన రెమిడీస్ ని ప్రయత్నించండి. అయితే, వాటి యొక్క ఫలితాలు వ్యక్తిగత శారీరక స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా ఆనియన్ రెమిడీస్ ని ఉపయోగించినప్పటికీ వెంటనే ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. ఈ రెమిడీలను కనీసం వారానికి 3 సార్లు 2 నెలల పాటు ఉపయోగిస్తే తప్పుకుంటా మీ జుట్టు పెరుగుదలలో మార్పులను చూడవచ్చు