బయట ఫుడ్ తినేవాళ్లు ఈ తప్పు అస్సలు చేయకండి….

ఈ రోజుల్లో యూత్ అనేది బయట ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ బయటి ఫుడ్ ను తినడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం! బయట ఫుడ్ ఏదో ఒక సమయంలో హోటల్స్ లో తీసుకుంటూ ఉంటారు. అయితే బయటి ఫుడ్ లో కూడా మనకు హెల్తీ ఫుడ్స్ దొరుకుతాయి. ఈరోజు ఒక్కరోజే కదా అని చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లి బిర్యానీ తినడం లేద ఒక బర్గర్ తినడం ఒక పిజ్జా తినడం ఇవన్ని ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఇలా బయట ఫుడ్ తినడం వల్ల వాటిలో ఉండే చెడు పదార్థాలు అన్నీ మన శరీరంలో పేరుకుపోతాయి. అమెరికాలో బర్గర్ పై స్టడీ చేసి అమెరికా వారు , బర్గర్ ను రోజు మూడు నెలల పాటు తింటూ ఉంటే మనసులో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని స్టడీ చేయగా, ఇలా తినేవారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ అనేది దాదాపుగా 100 శాతం పెరుగుతాయట.

అదే విధంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతారట. బయట ఫుడ్ ను అదేవిధంగా దాంట్లో జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల బాడీ పై విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. హార్మోన్ సమస్యలు మరియు చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ రావడం జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మనం చిన్న పిల్లల దగ్గర నుండి అందరికీ చాక్లెట్స్ అని కూల్ డ్రింక్స్ అని ,అన్ని అలవాటు చేస్తూ ఉంటాము. ఇలా ఎక్కడ చూసినా సరే ప్రతి కంపెనీ వారు కూడా వారి ప్రకటనలు చేస్తూ ఉంటారు, వీటిని చూసిన పిల్లలు కూడా ఎట్రాక్ట్ అవుతారు. కానీ వీటిలో షుగర్ కంటెంట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది, ఇలా తినడం వల్ల తాగడం వల్ల వాళ్లకు ఒక ఏజ్ వచ్చేసరికి ఉండాల్సిన బరువు కంటే విపరీతమైన బరువును కలిగి ఉంటారు.

అందువల్ల చిన్న పిల్లలకు వీలైనంతవరకు వీటిని అవయిడ్ చేయాలి. మనమందరం వైట్ రైస్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కానీ వైట్ రైస్ అనేది చాలా తొందరగా అరిగిపోతుంది, చిన్నప్పటి నుండి కూడా మనందరికీ వైట్ రైస్ అలవాటు చేస్తూ ఉంటాం, ఇది టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరికీ త్వరగా అలవాటు అవుతుంది. అని వైట్ రైస్ అనేది తొందరగా అరగడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత షుగర్ లో హెచ్చుతగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తారు, ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి అడగడం కూడా చాలా త్వరగా అరిగిపోతాయి. ఎవరికి కూడా బాడీ ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల చాలా యంగ్ వయసులోనే ఒబేసిటీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈమధ్య 25- 30 ఇయర్స్ వారికి హై బ్లడ్ షుగర్ వస్తున్నాయి.అందువల్ల చిన్నప్పటి నుండే పిల్లలకి మంచి ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి.

ఇలా చేయడం ద్వారా చిన్నప్పటినుండే పిల్లలకి హెల్త్ పై ఒక అవగాహన అనేది వస్తుంది. వారికి యోగ అలవాటు చేయడం, వ్యాయామం అలవాటు చేయాలి. ఇలా చేస్తే వాళ్లు పెద్దయిన తర్వాత ఆటోమేటిగ్గా హెల్త్ కు సంబంధించిన జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. మనం వీలైనంత వరకు అరగడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాలను తీసుకోవాలి, ఇది ఎక్కువసేపు కడుపులో ఉండటం వల్ల ఆ తర్వాత మెల్లమెల్లగా షుగర్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి, అందువల్ల షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఉండవు. రాగులు ,కొర్రలు, జొన్నలు, పప్పులు, చిరుధాన్యాలు లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది, షుగర్ కంటెంట్ ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్ అనేది చాలా అరుదుగా తీసుకోవాలి.