మగవాళ్ల ముఖ అందాన్నీ పెంచే 6 చిట్కాలు …..

మగవారు ఎక్కువ తమ బాధ్యతల పరంగా తమ ఉద్యోగ పరంగా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. అంతే కాకుండా వాళ్ళ ఫేస్ కలర్ గురించి కేర్ తీసుకునేంత టైం కూడా కొన్ని సందర్భాలలో ఉండకపోవచ్చు. అందుకోసమే కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు షేర్ చేయబోతున్నాం. వీటిని మీ డైలీ లైఫ్ లో పాటించడం అనేది నేచురల్ గా మీ స్కిన్ కలర్ ని పెంచడం లో మంచి రిజల్ట్స్ ని తీసుకు వస్తాయి. నీ ఫేస్ విషయంలో మీరు కేర్ తీసుకోవాలి అనుకుంటే మొదటగా మీ స్కిన్ ఏ రకం అనేది మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. మగవారిలో మొత్తం ఐదు రకాల స్కిన్ టైప్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది నార్మల్ స్కిన్ ,నార్మల్ స్కిన్ కలిగి ఉన్న వారిలో చర్మ కణజాలం నుండి నూనె సరైన స్థాయిలో ఉత్పత్తి అవుతాయి, ఈ తరహా చర్మానికి సాధారణంగా ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి మార్పు లేకుండా చక్కగా ఉంటారు, మొటిమలు లాంటి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి.

రెండవది డ్రై స్కిన్, డ్రై స్కిన్ కలిగి ఉన్నవారికి మెయిన్ గా ఉండే ప్రాబ్లం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా చర్మం పొడిగానే ఉంటుంది, ఎంత మాయిశ్చరైజర్ రాసినా కూడా అలాగే పొడిగా ఉంటుంది. ఇలా జరగడానికి కారణం వీటి చర్మం గట్టిగా మరియు పొరలుగా ఉండడమే. పొడి చర్మం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారి ముఖం చాలా అందంగా మార్చుకోవచ్చు, ఈ చర్మం ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ చర్మం అనేది మీ వయసు కంటే పెద్దవారిలా కనిపించేలా చేస్తుంది. మూడవది ఆయిల్ స్కిన్, మీది ఆయిలీ స్కిన్ అయితే నీ ముఖం పై మాయిశ్చరైజర్ లాంటివి రాయడం ఆపేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీ చర్మం తేమగా ఉంటుంది కనుక మీ చర్మం అనేది ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం వల్ల మీ చర్మం ఇలా ఆయిల్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది.

మీ చర్మాన్ని ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉండండి, ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి, అంతేకాకుండా ఈ ఆయిల్ అనేది మీ చర్మం యొక్క మొత్తం కాంతి నీ తొలగిస్తుంది. కాంబినేషన్ స్కిన్: కొన్ని చోట్ల పొడిగా మరికొన్ని చోట్ల జిడ్డుగా ఉండే చర్మాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఈ చర్మం ఉన్నవారికి నుదురు,ముక్కుపైన గడ్డం మొదలైన భాగాల్లో స్కిన్ ఆయిల్ గా మిగిలిన భాగాలలో పొడిగా ఉంటుంది. వీరికి సీజన్ నీబట్టి చర్మం మారుతుంది. ఐదవది సెన్సిటివ్ స్కిన్: ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి చర్మం త్వరగా పొడిబారడం జరుగుతుంది మరియు ఈజీ గా దురదలకు లోనవుతుంది. మీరు కొద్దిసేపు ఎండలో ఉన్నాకూడా ముఖం అంతా ఎర్రగా మారిపోతుంది, దుమ్ము ధూళి లాంటివి తగిలిన చర్మానికి దురద పెట్టడం, లేదా మంటపుట్టడం లాంటిది జరుగుతూ ఉంటుంది, ఈ తరహా చర్మం ఉన్నవారు సెన్సిటివ్ స్కిన్ కోసం తయారుచేసిన ప్రొడక్టులను ఉపయోగించటం అనేది మంచిది.