మీరు రోజు తాగే పాలు ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి..నమ్మలేని నిజాలు…..

పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.

పాలలో ఔషధోపయోగాలు :-

లావెక్కడానికి : బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థి తికి వచ్చేస్తుంది.పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

సజావుగా రక్తప్రసరణ : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది శరీరంలో రక్తప్రసరణ సహ జసిద్ధంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్ధి తికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.

పాల ఉత్పత్తులు:-

1 .మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు.

2 .పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.

3 .పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి.

4 .మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది.

5 .మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది.

6 .వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.