మీ గుమ్మం దగ్గర ఈ వస్తువులను పెట్టకండి

ఇంటి గుమ్మం దగ్గర ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో పైసా కూడా మిగలకుండా ఇబ్బంది పడిపోతారు ఇలాగే కాకుండా చాలా వరకు కూడా కష్టాలను కొని తెచ్చుకుంటారు.ముఖ్యంగా వచ్చేసి గుమ్మం దగ్గర ఈ పనులను అస్సలు కూడా చేయకూడదు అని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు. పండితుల ప్రకారం ఏమిటంటే గుమ్మం దగ్గర ఇలా చేసిన వారి ఇంట్లో అసలు కూడా ధనం నిలబడదు, చాలా వరకు కూడా భర్త సంపాదన తగ్గిపోతుంది భర్తకు వచ్చే ఆదాయం చాలావరకు తగ్గిపోతుందని మనకు చెప్పదగ్గ విషయం కాబట్టి మన దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా, ఈ యొక్క చిన్న చిన్న తప్పులను అస్సలు చేయకండి అలా ఒకవేళ చేసినట్లయితే ఏమవుతుందంటే, దరిద్రం అనేది చుట్టుకుంటుంది, చాలా వరకు కూడా జేష్ఠాదేవి దరిద్రం అన్నీ కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి.

ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా నిష్టగా నియమాలను పాటించుకుంటే, లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావడం జరుగుతుంది భర్త సంపాదన కూడా పెరగడం జరుగుతుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఇంటి గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము. గుమ్మం దగ్గర చేసే ప్రతి పనిని కూడా మనం లక్ష్మీదేవి ఇష్టంగా అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే మన ఇంటి గుమ్మాన్ని ప్రతి శుక్రవారం మరియు ఇతర పండుగ రోజులలో చక్కగా పసుపుతో రాసి కుంకుమతో బొట్లు పెట్టి, అలంకరించుకుంటూ ఉంటాము. ఇలా ఉంటే లక్ష్మీదేవి కచ్చితంగా మన ఇంటికి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం. అలాగే ఇంట్లో ఏదైనా పండగలు వచ్చినప్పుడు పచ్చని తోరణాలను గుమ్మానికి కడతాము, అలాగే పూలను కూడా చక్కగా తోరణంలా కడతారు.

అలాగే వేప మండలు మామిడి ఆకులు పూల తోరణాలు ఇలా కట్టి మానే చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము. ఇలా అలంకరించిన తర్వాత మన ఇంటికి ఎంత కళా వస్తుందో, మన ఇంట్లో మనం ఎంత సంతోషంగా ఉంటామో మీరు గమనించుకోండి. అంతేకాకుండా మన గుమ్మం ఎప్పుడు కూడా మామూలు ఆకులు ఎండిపోయిన తర్వాత పూలు వాడిపోయి రాలిపోతున్న కూడా అలాగే ఉంచకూడదు. అవి ఎండిపోయిన తర్వాత వాటిని తీసేసి ఎక్కడైనా సరే పక్కకు వేయాలి, ఇలా చేయడం ద్వారా కూడా మనకు చాలావరకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీరు మనకి చక్కగా కుంకుమ పసుపులతో అలంకరించిన తర్వాత, ముగ్గు పెట్టి ముగ్గుపై పసుపు కుంకుమను తప్పకుండా వేయండి. ఇలా వేసిన వారి ఇంట్లో కచ్చితంగా ధనం నిల్వ ఉండడమే కాకుండా, భర్త సంపాదన పెరుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని, పురాణ గ్రంథంలో పేర్కొనడం జరిగింది.