మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ

బ్రేకింగ్ న్యూస్ :మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్ధరాత్రి గొడవ చోటు చేసుకుంది . నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడు అంటూ అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు పిర్యాదు చేసారు . అయితే అపార్ట్ మెంట్ వాసులపై చైతన్య కూడా కంప్లెన్ట్ చేయడం తో పరస్పర ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేస్తున్నారు .

గత ఏడాది ఆగస్ట్ నెలలో నటుడు నాగబాబు గారి కుమార్తె నిహారికను చైతన్య జొన్నలగడ్డ అనే బిజినెస్ మ్యాన్ కి ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి ఎంతో మంది ప్రముఖుల సమక్షంలో జరిగిన విషయం కూడా తెలిసిందే . అయితే తాజాగా వస్తున్న నివేదికల ప్రకారం బంజారాహిల్స్ లో నిహారిక దంపతులు ఉంటున్న ఓ ఫ్లాట్ లో నుండి నిన్న అర్ధరాత్రి గట్టి గట్టిగా గొడవ కు సంబంధించిన అరుపులు వినిపించాయి అంటూ ఆ అపార్ట్మెంట్ లో నివసించే వారు తెలిపారు .