రాత్రి వేళ స్నానం చేయడం ఎంత పాపమో తెలిస్తే షా క్ అవుతారు…..

ఆయుర్దాయం పెంచే శుభ అశుభాల గురించి చెప్తున్నాడు భీష్ముడు, ధర్మరాజు ధర్మానందన వింటున్నారు. పూలల్లో తెల్లని, పచ్చని పూలను మాత్రమే ధరించాలి. రాత్రివేళ స్నానం మహా పాపం అసలు చేయకూడదు, పొద్దున స్నానం చేసిన తర్వాత శరీరాన్ని ఎక్కువగా తుడుచుకోరాదు, ఇలా తుడుచుకుంటే శుచిత్వం తొలగిపోతుంది అంటారు. స్నానానికి ముందు శరీరానికి సుగందాలను పూసుకోరాదు, తడి బట్ట గట్టిగా పిండినవి జాడించరాదు, ఇతరులు కట్టి విడిచిన వస్త్రాన్ని ధరించకూడదు. మర్రి ,మేడి ,పిప్పళ్ళ పళ్ళను నోటిలో పెట్టుకుని నమలరాదు. వేదం చెప్పిన కర్మ తంత్రాలతో గోవులు, నెమళ్లు, మేకలు లాంటి ప్రాణులను తినరాదు. ఇతరులు వాసన చూసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు, మనసును ఎక్కడో పెట్టి భోజనం చేయకూడదు, తింటున్న ఆహారాన్ని నిందించకూడదు. ఉప్పును చేతితో తాకి నోట్లో వేసుకున్న ,రాతి మీద ఉప్పును తీసుకున్న, రాత్రివేళ పెరుగన్నం తిన్న, తీయని పదార్థాలను స్వీకరించిన, పేలపిండి తిన్న మహా పాపం అని పెద్దలు అంటారు.

ఇతరులు చూసిన ఆహార పదార్థాలను వారికి ఇవ్వకుండా తినరాదు. బంతిలో అందరికీ ఒకే లాగా వడ్డించాలి హెచ్చుతగ్గులుగా వడ్డించడం చేయకూడదు, అలా వడ్డిస్తే అది విషంతో సమానం అంటారు. నెయ్యి, తేనె, పేలపిండి, పెరుగు, పాయసం, మంచినీరు ఒకరికి ఇవ్వగా వారు తిన్న తర్వాత ఇంకా మిగిలితే ఆ మిగిలిన దానిని వేరొకరికి ఇవ్వకూడదు, ఇలా ఇచ్చినట్లయితే ఆయుర్దాయం క్షీణిస్తుంది. చిటికెన వేలు అగ్రభాగాలు మొదల్లో దేవర్షి తీర్ధాలు అని ధర్మవేత్తలు అంటారు, కుడిచేతి చూపుడు వేలికి మధ్య ఉన్న భాగాన్ని పైత్రుక తీర్థం అన్నది వారే, ఈ కారణం చేతనే పితృ తర్పణాలలో ఇది ప్రశస్తమైనది. తర్పణ విధి అంతా ఆచమన పూర్వకంగానే నిర్వహించాలి పౌరుషంగా మాట్లాడడం కోపం పనికిరావు. పగటివేల స్త్రీ పురుషుల కలయిక పనికిరాదు, ఉమ్ము వేసినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆచమనం చేసి తీరాలి. ఒకవేళ ఆచమనానికి అవకాశం లేని పక్షంలో ప్రణ ఉచ్చారణ చేస్తూ సూర్యుని వైపు చూసి కుడి చెవిని పట్టుకోవాలి. చెల్లెలు, గురువు ,మిత్రుడు, పండిత వంశానికి చెందినవారు కష్టకాలంలో ఉంటే వారిని వెంటనే ఆదుకోవాలి.

ఇలా ఆదుకుంటే ఆయుర్దాయంతో పాటు సిరిసంపదలు కూడా కలుగుతాయి. పావురాలు ,చిలుకలు, గోరువంకలు, పూల తీగలు, అద్దాలు గృహానికి శుభం చేకూరుస్తాయని అంటారు. గువ్వ దీపాలను ఆర్పేస్తే, పురుగులు ఇంట్లోకి ప్రవేశిస్తే శాంతి చేయాలి, సంధ్యలలో చదువు కానీ భోజనం చేయడం కానీ మంచిది కాదు. రాత్రివేళ పితృ కార్యం చేయకూడదు మహా పాపం. పిలుపు లేని విందు భోజనానికి ఎప్పుడు వెళ్ళకూడదు, తల్లిదండ్రులకు ,పిల్లలకు నవ్వుతూనే హితబోధం చెప్పాలి. రజస్వలతో సాంగత్యం మహాపాపం, స్నానం చేసిన తర్వాత నాలుగవ నాటి రాత్రి సమాగమం సుముచితం అంటారు, మరికొందరు ఐదవ నాటి రాత్రి కానీ సాంగత్యం కూడదు అంటారు, ఆరవనాటి కలయిక వల్ల కొడుకు పుడతాడు ఇదే విధంగా సరి బేసి దినాలలో కలయిక వల్ల కొడుకు కూతురు కలుగుతారని అంటారు. ఈ విధంగా 16 రోజులపాటు స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని పెద్దలు అంటున్నారు. ధర్మనిష్టికి ఆచారం ప్రధానం ,ధర్మాల వల్ల సిరిసంపదలతో పాటు ఆయుర్దాయం, కీర్తి పెరుగుతాయి. ప్రాణులన్నిటిని ప్రేమించగలగాలి ప్రేమించగలిగితే మహా మహా పాపాలు కూడా పటాపంచలవుతాయి అని చెప్పడం ముగించాడు భీష్ముడు.