వందల రోగాలని నయం చేసే పేదోడి గంజి అన్నం….

ఇవాళ మనం ఈరోజు స్పెషల్ బాడీ కూల్ ది బెస్ట్ గంజి అన్నాన్ని ఎలా తయారుచేసుకోవాలో మరియు దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం! ఇది సూపర్ రెసిపీ, దీనిని పసిపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మన పూర్వీకులు రోజు ఉదయం సాయంత్రం ఇది తిని పెరిగిన వారే, ప్రత్యేకించి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండేటటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల వారికి వేసవిలోనే కాదు అన్ని వేళలా అన్ని కాలాల్లోనూ సంజీవని లా పనికొస్తుంది ఈది బెస్ట్ గంజి అన్నం.దీనికోసం ముందుగా ఒక కప్పు కడిగిన బియ్యాన్ని తీసుకోండి, దీంట్లో నాలుగు కప్పుల నీళ్ళు పోసి అన్నం వండండి, నిజానికి మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి కి రెండు కప్పుల నీళ్ళు అయితే కరెక్టుగా సరిపోతుంది.

కానీ ఈ రెసిపీ కి గంజి కావాలి కాబట్టి మరో రెండు గ్లాసులు ఎక్కువ పెట్టుకోవాలి, అన్నాన్ని మెత్తగా వండుకోవాలి. అన్నం మెత్తగా అయిన తరువాత గంజి వార్చుకోవాలి, సాధారణంగా గంజి వార్చుకునేవారు మిగిలిపోయిన అన్నం లో గంజి వార్చుకుని కలిపి వండుకుంటారు, నేను ఈ రెసిపీ కోసమే చేస్తున్నాను కాబట్టి ప్రొసీజర్ చూపిస్తున్నాను. ఇప్పుడు చల్లారిన అన్నాన్ని ఒక మట్టికుండలో తీసుకోవాలి, చల్లారిన అన్నం అంటే మిగిలిపోయిన అన్నం అనుకోండి, దీంట్లో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి అలాగే రెండు కప్పుల గంజిని పోసుకోవాలి, అలాగే అర టీ స్పూన్ వామును నలిపి వేసుకోవాలి, ఇందులోనే రెండు కప్పుల పల్చటి మజ్జిగ పోసుకోవాలి.

తర్వాత రుచికి సరిపడా రాళ్ల ఉప్పును వేసుకోవాలి, ఆ తర్వాత ఉల్లిపాయలు నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి, తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి రాత్రంతా పులియపెట్టాలి. ఆ తర్వాత లోపల పులి ఉడికి పోతున్న టువంటి ప్రేగులను చల్లార్చి శరీరానికి చలవ చేసే మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా నాలుగు సగ భాగాలుగా వేస్తేనే ఘాటు కలిగి పులుపును తినగలిగేలా ఉంటుంది, నచ్చితే ఆవకాయ నంజుకుని తినండి, ఇది శరీరానికి అమృతం లాంటి ఆహారం. పొట్ట కు సంబంధించి ఎలాంటి వ్యాధులు ఉన్నాసరే ఈ గంజి అన్నం తినడం వల్ల మేలు జరుగుతుంది ఎదిగే పిల్లలకు ఇంకా మేలు చేస్తుంది.