వినాయక చవితి పూజలో గణపతి తొండం ఎటువైపు ఉండాలి….

వినాయక చవితి రోజు ఎటువైపు తొండమున్న గణపతిని పూజిస్తే విశేషంగా ధన లాభము, అదృష్టమో కలిసి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక విగ్రహానికి తొండం అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వినాయకుడి విగ్రహంలో తొండం అనేది ఓంకారాన్ని తెలియజేస్తుంది. సృష్టి మొత్తం కూడా ఓంకారం లోనే ఉంది, కాబట్టి వినాయక విగ్రహంలో తొండాన్ని బట్టి సృష్టిలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా మన కుటుంబం మీద మన మీద ప్రసరిస్తుంది. అందుకే వినాయక చవితి రోజు తొండం ఎటువైపు తిరిగి ఉన్న వినాయకుడికి పూజ చేస్తే ధన లాభము అప్పులు తీరిపోవడం, మొండి బాకీలు వసూలు కావడం, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోవడం జరుగుతాయో, అలాగే మోక్ష ప్రాప్తిని సిద్ధింప చేసుకోవాలి అంటే, ఎటువైపు తొండం ఉన్న వినాయకుని పూజించాలో గణేశ పురాణంలో చెప్పడం జరిగింది. సహజంగా ఎవరికైనా సరే హృదయం అనేది ఎడమవైపు ఉంటుంది.

హృదయ స్పందన అనేది కోరికలకు సంకేతం, మనకు ఉన్న కోరికలన్నీ హృదయ స్పందనను బట్టి ఉంటాయి, హృదయం అనేది ఎడమవైపు ఉంటుంది కాబట్టి, వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగే ఉన్నట్లయితే మన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. కాబట్టి ఎవరైనా సరే మీకు ధన లాభం కలగాలి అంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే అప్పుల సమస్యలు తీరాలి అంటే, మొండి బాకీలు వసూలు కావాల అంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ పోవాలి అంటే, వినాయక విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండం ఉన్నటువంటి విగ్రహాన్ని పూజలో పెట్టుకోండి. ఆయనకి ఎడమవైపు అంటే మనకు కుడివైపు, వినాయకుడికి కుడివైపు అంటే మనకు ఎడమవైపు, కాబట్టి వినాయకుడి విగ్రహంలో ఆయనకి ఎడమవైపు తొండం ఉండాలి.అంటే మనకు చూసినప్పుడు అది కుడివైపులాగా కనిపిస్తుంది. అలాగే ఎవరైనా సరే మోక్షం కావాలి అంటే, కర్మ ఫలితాలన్నీ తొలగింప చేసుకోవాలి అనుకోండి.

ప్రారబ్ద కర్మలు సంచిత కర్మలు ఇవన్నీ తొలగింప చేసుకోని తర్వాత మోక్షం లభించాలి అంటే, మానసిక ప్రశాంతత లభించాలి అంటే అలాంటి వాళ్ళు గణపతి విగ్రహంలో వినాయకుడికి కుడి వైపు తొండం ఉన్న గణపతిని పూజలో ఉంచుకోవాలి. మీ కోరికను బట్టి తొండాన్ని బట్టి వినాయకుడికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు వినాయకుడి విగ్రహాన్ని చూసినప్పుడు, వినాయకుడు ఆయనకి ఎడమ చేతిలో మోదకాన్ని పట్టుకొని ఉంటాడు. మోదకము అంటే సంతోషము మోదకం అంటే లడ్డుని మోదకం అంటారు. ఉండ్రాయిని మోదకం అంటారు. ఆ వుండ్రాయిని ఆయన ఎడమ చేతిలో ధరించి ఉంటాడు, ఆ మోదకం అనేది సంతోషానికి సంకేతం, కోరికలకు సంకేతం కోరికలకు సంకేతమైన మోదకం అంటే ఉండ్రాయిని లడ్డుని ఆయన ఎడమ చేతిలో పట్టుకుని ఉన్నాడు కాబట్టి, మన కోరికలన్నీ తీరాలంటే ఆయనకు తొండం కూడా ఎడమవైపు ఉండాలి. ఆయన మోదక మెడమ చేతిలో ఉంది కాబట్టి ఆయన తొండం కూడా ఆయనకు ఎడమవైపు ఉండాలి.