వినాయక చవితి రోజు సరిగ్గా ఈ టైంలో పూజ చేస్తే అన్ని కష్టాలు, సమస్యలు తొలిగిపోతాయి…

వినాయక చవితి రోజు ఏ సమయంలో పూజ చేస్తే వినాయకుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఒక్కొక్క సమయంలో వినాయకుడికి పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజు వచ్చింది. బుధవారానికి అధిపతి నవగ్రహాలలో బుధుడు, బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి. బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి బుధ హోరా ఉన్న సమయంలో వినాయకుడికి పూజ చేస్తే బుధుడి బలం విపరీతంగా పెరిగి గణపతి అనుగ్రహం కలుగుతుంది. బుధుడు విద్యా కారకుడు, బుధుడు ఉద్యోగ కారకుడు అలాగే వ్యాపార కారకుడు కాబట్టే ఎవరైనా సరే ఇంట్లో పిల్లలు బాగా చదవాలంటే ఎడ్యుకేషన్ లో టాప్ పొజిషన్ కి వెళ్లాలంటే అలాగే జాబ్ లేనివారికి జాబ్ రావాలి అంటే బిజినెస్ చేసే వారికి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేయాలి. వరసిద్ధి వినాయక వ్రతకల్పం అనేది బుధోరలో చేసుకోవాలి.

ఈ బుధ హోరా అనేది ఉదయం 6 గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది కాబట్టి, వినాయక చవితి రోజు ఉదయం 6 నుండి 7 మధ్యలో వినాయకుడికి పూజ చేస్తే విద్యాపరంగా, ఉద్యోగ పరంగా ,వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో పూజ చేసుకోవడం వీలు కాకపోతే మళ్లీ వినాయకుడికి పూజ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, బుధవారం రోజు కేతువు కాలంలో పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు రాహుకాలం ,కేతుకాలం అని ఉంటాయి. నవగ్రహాలలో కేతువుకు కూడా అధిపతి వినాయకుడే. కేతుకాలంలో వినాయకుడికి పూజ చేస్తే జీవితంలో ఆకస్మికంగా సమస్యలు రావు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు రావు, అన్ఎక్స్పెక్టెడ్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే, వినాయక చవితి రోజు కేతుకాలంలో పూజ చేయాలి. ఈ కేతుకాలం అనేది ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది.

అయితే ఉదయం 7:51 నుండి వర్జ్యం ప్రారంభమవుతుంది ఇది 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి వర్జ్యంకి ముందు కేతుకాలంలో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. ఎవరైనా ఉదయం 6 నుండి 7 లోపు చేసుకో లేకపోతే ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుండి 7:50 నిమిషాల మధ్యలో ప్రారంభించుకోండి దాన్ని కేతుకాలం అంటారు. ఇలా చేస్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, ఆ సమయంలో కూడా పూజ చేయడం నీకు వీలుకాకపోతే వర్జ్యం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చు.ఉదయం 7: 51 నుండి 9:34 వరకు వర్జ్యం ఉంది ఈ సమయంలో వినాయకుడికి పూజ చేయకూడదు. మళ్లీ ఉదయం తొమ్మిది గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు. మళ్లీ ఉదయం 11: 42 నుండి 12:30 మధ్యలో దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఆ సమయంలో పూజ చేయకూడదు. అయితే బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు కూడా రాహుకాలం ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా పూజ చేయవద్దు. అయితే గుళిక కాలం అని ఉంటుంది, ఆ గుడిక కాలంలో పూజ చేసినా కూడా పూజకి పూర్తి ఫలితం రాదు.

వినాయక చవితి బుధవారం రోజు గుళిక సమయం ఏ సమయంలో ఉన్నాయి అంటే ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్య ప్రాంతంలో గుళిక కాలం ఉంది కాబట్టి పూజ చేసుకోవాలి అని భావించిన వారు, ఉదయం తొమ్మిది గంటల 35 నిమిషాల నుండి 11 :41 నిమిషాల వరకు టైం బాగున్నా కూడా, గుళిక కాలం లేని టైంలో పూజ చేసుకోవాలి. అంటే మార్నింగ్ 9:35 నుండి 10 :25 మధ్యలో పూజ చేసుకోవచ్చు, ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది. వినాయకుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే, ఆరోజు పూజ చేసుకునే టైంలో మూడు రకాలుగా ఉంటాయి. మొదటి సమయం మార్నింగ్ 6:00 -7:00, రెండవ సమయం ఉదయం 7: 30 నిమిషాల నుండి 7:50 మధ్యలో దీన్ని కేతుకాలం అంటారు, మూడవ సమయం ఉదయం 9:30 నుండి 10:25 మధ్యలో పూజ స్టార్ట్ చేసి చేసుకుంటే, సంవత్సరం మొత్తం వినాయకుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది.