వీడియో: బాలయ్య తాత నాన్న లేవడం లేదు చూడు.. నిష్కను చూస్తే కన్నీరు ఆగదు!

పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు నాన్నే హీరో. తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు.. కొడుకుల మీద కన్నా బిడ్డపైన కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నాన్న దృష్టిలో ఆడపిల్ల అంటే ఓ యువరాణి. మరి బిడ్డను అంతలా ప్రేమించే తండ్రి దూరమైతే.. ఆ బాధ ఎంత నరకమో కదా. ప్రస్తుతం తారకరత్న కుమార్తె నిష్క బాధను చూస్తే.. ఎంత కష్టం వచ్చింది అనిపించక మానదు. తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.సుమారు 20 రోజులకుపైగా మృత్యువుతో పోరాడి.. అలసి పోయి.. అనంత లోకాలుకు చేరుకున్నాడు నందమూరి తారకరత్న. గత నెల 27న కుప్పంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తారకరత్న.. మృత్యువుతో పోరాడుతూ చివరకు ఓడిపోయారు.

శివరాత్రి పండుగ నాడు శివైక్యం చెందాడు తారకరత్న. అతడి మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకతర్న భార్య, బిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. నాన్న ప్రేమ, తోడు అవసరం ఉన్న వయసులో.. దేవుడు ఆ చిన్నారుల తండ్రిని దూరం చేసి వారికి తీరని గుండె కోత మిగిల్చాడు. ఏ కష్టం వచ్చినా నాన్న ఉన్నాడు అనుకుని ధైర్యంగా ఉన్న ఆ చిన్నారులు.. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మాతో ఆడిపాడి ప్రేమగా ఎవరు లాలిస్తారు.. నేనున్నాను అంటూ మాకు ఎవరు ధైర్యం చెబుతారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.మరీ ముఖ్యంగా తారకరత్న పెద్ద కుమార్తె నిష్కను ఎవ్వరు పలకరించినా సరే.. నాన్న కావాలంటూ ఏడుస్తుంది.

ఇక తారకరత్నను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ సెలబ్రిటీలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలయ్య తారకరత్న నివాసానికి వచ్చారు. తారకరత్న పార్థీవదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో గుండెల్ని మెలిపెట్టే సంఘటన చోటు చేసుకుంది. తారకరత్న నివాసంలోకి వెళ్లిన బాలకృష్ణ.. విజయసాయి రెడ్డితో మాట్లాడుతుండగా.. తారకరత్న కుమార్తె నిష్క చూసింది. వెంటనే పరుగెత్తుకెళ్లి.. బాలకృష్ణను గట్టిగా హత్తుకుని ఏడ్చింది. తాతయ్య.. నాన్న లేవడం లేదు చూడు అంటూ ఆ చిన్నారి ఏడుస్తుంటే.. బాలయ్య బాధను ఆపుకోలేకపోయారు.

గుండెల్లో దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది.వెంటనే నిష్కని హత్తుకుని బాలకృష్ణ కూడా కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత చిన్నారిని ఓదార్చుతూ.. ఊరుతో తల్లి.. ఏడవకూ మేమంతా ఉన్నాం అంటూ ధైర్యం చెప్పారు. బాలయ్య పక్కనే ఉన్న విజయసాయి రెడ్డి కూడా నిష్కను చూసి కన్నీరు ఆపుకోలేకపోయారు. ఏడవకమ్మా అంటూ నిష్కను ఓదార్చారు. ఇక తారకరత్నను తలచుకుని బాలకృష్ణ..‘‘బాల బాబాయ్ అంటూ.. ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకుంటేనే.. తట్టుకోలేకపోతున్నాను’’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.

ఎంతో ధైర్యంగా, గంభీరంగా ఉండే బాలయ్యను అలా చూసి చూసి మిగతా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.ఇక తారకరత్న అనారోగ్యానికి గురైన నాటి నుంచి బాలకృష్ణ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తారకరత్నతో పాటే ఉంటూ ఆయన చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయసాగారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ.. వారికి అండగా నిలిచారు. ఇన్ని రోజులు బాలయ్య.. తారకరత్నతో పాటు బెంగళూరు ఆస్పత్రిలోనే ఉన్నాడు. కన్న కొడుకుకంటే ఎక్కువగా తారకరత్న గురించి శ్రద్ధ తీసుకున్నారు. కానీ విధి వారి కుటుంబం మీద పగ పట్టి.. తారకరత్నను దూరం చేసింది. ఇక సోమవారం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.