శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పొరపాటున ఈ పువ్వుతో పూజిస్తే ఇంట్లో పైసా మిగలదు అదే ఈ పువ్వుతో పూజిస్తే…

శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయితే శ్రావణమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు ఆడవారు శ్రావణమాసం లో ఆడవారు తప్పనిసరిగా ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం, ప్రతిరోజు పండుగగా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ యొక్క మాసం అంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషబాదిదేవతలకు అత్యంత ప్రీతికరమైనది ఈ యొక్క మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి యొక్క విశిష్టత చాలా ఉంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తిధులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణమాసం అంటే శుభ మాసం.

శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం స్త్రీలందరికీ ప్రీతికరమైనది, ఇది శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకి సర్వ సౌభాగ్యాలను పసుపు కుంకుమలను ఐశ్వర్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం . లక్ష్మీ ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాయలలో అనగా ఆదిలక్ష్మి, దాన్యలక్ష్మి ,ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి,విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తాము. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని గావిస్తే ధనం, ధాన్యం, శక్తి ,విద్యా, సంతానం, విజయం, మేధస్సు చేకూరుతాయని మహాశివుడు పార్వతి దేవికి తెలియజేశాడు. ఈ వరలక్ష్మి వ్రతానికి కొద్దిగా గొప్పో బంగారాన్ని కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగుపొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటిపళ్ళు పసుపు కుంకుమ ఆకు ఒక్క రవి కల గుడ్డతో వాయినంగా ఇస్తారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని అనుకుంటూ ఉంటారు. ఇచ్చికుచ్చుకోవడంతో మర్యాదగుణంతోపాటు ఈ యొక్క హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెళ్లి విరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్యస్త్రికి కాళ్ళకి పసుపు రాసి గంధం బొట్టు పెడతారు.

ఈ వర్షాకాలం కాళ్లకు పసుపు రాయడం చాలా మంచిది, సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడాను. ఈ యొక్క శ్రావణమాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు. శ్రావణమాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణమాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాల చుక్కలు వేసుకునే స్నానం చేయండి. శ్రావణమాసంలో ఇలా స్నానం చేస్తే త్వరగా లక్ష్మీ యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణమాసంలో ఆడవారు సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిరుద్రించకూడదు, అలా నిద్రించి నట్లయితే ఇక లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజించకూడదు, లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు కూడాను ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవిని పూజించకూడదు, శ్రావణమాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజించినట్లయితే ఇక మీ ఇంట్లో కనక వర్షం వస్తుంది, అదేవిధంగా శ్రావణమాసంలో నిద్రపోయేటప్పుడు తడికాళ్లతో నిద్రించకూడదు.

భోజనం చేసేటప్పుడు తడి దుస్తులతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది, అలాగే చాలామంది రాత్రుల్లో సింకులో గిన్నెలు వదిలేసి అలాగే పడుకుంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నం తిన్న గిన్నెలను రాత్రి మొత్తం సింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, శ్రావణమాసంలో వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం కాబట్టి చాలామంది స్త్రీలలో తాంబూలం తీసుకోవడానికి పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం అస్సలు వెళ్ళకూడదు, అలా వెళ్లడం తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు కాబట్టి వీళ్లు పూజలు పాల్గొనకూడదు, అలాగే సీతాఫలం, దానిమ్మ ఫలం ఈ రెండు కూడా లక్ష్మీదేవి యొక్క స్థానాలు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఫలాలను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి స్వీకరించండి.