సాక్షాత్తు చదువుల తల్లి ఇచ్చిన ఆకు ….

కొంతమంది చిన్నప్పటినుండి బాగా తెలివితేటలతో జ్ఞాపకశక్తితో ఆలోచించే తీరులో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చాలా షార్ప్ గా యాక్టివ్ గా ఉంటారు. మరి అందరూ కూడా అలా ఉండరు కదా. కొంతమందికి చదవాలని ఆసక్తి తక్కువ ఉంటుంది ,చదివినా కానీ గుర్తుండదు ,అలాగే ఏదైనా చూసి నేర్చుకోవడం కూడా చాలా లేటుగా నేర్చుకుంటారు, వెనక నుండి ముందుకి ముందు నుండి, వెనకకి గుర్తు పెట్టుకునే విధానాలు కానీ, మరి జనరల్ గా ఇంటిలిజెంట్స్ కానీ మెమొరీ కానీ, అలాగే జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ఆసక్తి తక్కువగా ఉన్నప్పుడు. మరి ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ పిల్లల గురించి ఇలా ఆశిస్తూ ఉంటారు మా పిల్లవాడికి బాగా జ్ఞాపకం ఉంటే బాగుండు తెలివితేటలు పెరిగితే బాగుండు బాగా వస్తే బాగుండు, అలాగే మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే బావుండు అని ఆలోచిస్తారు.

ఇలాంటి బెన్ఫిట్స్ పిల్లల్లో రావాలి అన్న, మెమోరీని కానీ చదివే విధానాలలో మార్పు తీసుకువచ్చేటివి ఏమైనా ఉన్నాయా అంటే, సరస్వతి ఆకు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సరస్వతి ఆకు పౌడర్ కానీ సరస్వతి ఆకు చూర్ణం కాని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దీన్ని బ్రహ్మీ అని కూడా పిలుస్తారు మరి సరస్వతి ఆకు వల్ల ఇలాంటివి ఏమైనా ఇంప్రూవ్ అవుతాయా అని, చాలామందికి సందేహం. చదువుల తల్లి సరస్వతి అంటారు కదా మరి బాగా చదువు రావాలంటే సరస్వతి ఆకు మంచిదని పేరు కూడా అలాగే పెట్టారు. మరి ఇది సైంటిఫిక్ గా కరెక్ట కాదా అని ఒకసారి ఆలోచిస్తే ఇది చాలా కరెక్ట్ అని నిరూపించిన వారు, 2017వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఒకల హోమా హెల్త్ సైన్సెస్ యూఎస్ఏ వారు. ఈ సరస్వతి ఆకు మీద స్పెషల్ గా పరిశోధనలు చేశారు, 72 మందికి ఈ ఆకును తినిపించడం జరిగింది. మరో 72 మందికి ఇలాంటి ఆకు ఇవ్వకుండా సాధారణంగా ఉంచారు.

ఇలా మూడు నెలల పాటు సరస్వతి ఆకును 12 వారాలపాటు రోజు ఇవ్వడం వల్ల జనరల్ నాలెడ్జ్ కానీ చదివే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ అలాగే మెమొరీ విషయంలో కానీ, జ్ఞాపకశక్తి విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, చూసి నేర్చుకునే విధానంలో కానీ వెనక నుండి ముందుకి ముందు నుండి వెనకకి గుర్తు పెట్టుకునే విషయాలలో కానీ 30% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. త్రీ మంత్స్ లో అని అమెరికా వారు 72 మంది మీద చేసిన పరిశోధనలో సరస్వతి ఆకు వాడిన వారికి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందని వాడని వారితో పోలిస్తే అని ఆ డిఫరెన్స్ ని క్లియర్ గా కాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. ఆనాటి నుండి మన ఋషులు ఇచ్చిన సరస్వతి ఆకు యొక్క లాభాలు మెదడుకి జ్ఞాపకశక్తికి చదువుకునే విధానానికి చాలా చాలా మంచిదని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని క్లియర్ గా పరిశోధనలో చెప్పబడింది. ఇలాంటి సరస్వతి ఆకు చూర్ణం కాని సరస్వతి ఆకు కానీ వాడడం వల్ల చదువు విషయంలో చాలా మేలు జరుగుతుంది అని చెప్పబడింది.