సున్నం తో నేను చెప్పినట్టు చేస్తే జస్ట్ 10 నిమిషాల్లో కీళ్ల నొప్పులు పరార్…

నొప్పులు, చాలామంది ప్రపంచంలో బాధపడుతున్న సమస్య ఇది. కానీ ఈ నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, డీ జనరేటివ్గా మన శరీరంలోనే లోపం ఏర్పడే రావడం ఒకటి అయితే, చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట కిందపడడం దెబ్బ తగలడం ఆ నొప్పి తగ్గకపోవడం దాంతో ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అలాగే రోజు పెయిన్ కిల్లర్ వేసుకుని బ్రతకాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే పెయిన్ కిల్లర్ మూడు గంటలు నాలుగు గంటలు మాక్సిమం 10 గంటల పాటు ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది.

ఇలా మీరు రోజు పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి పెయిన్ కిల్లర్ వేయగానే వెంటనే గ్యాస్ సమస్య వస్తూ ఉంటుంది, మళ్లీ ఆ సమస్యను పోగొట్టుకోవడానికి మరొక టాబ్లెట్ వాడాలి. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ తగ్గించడానికి మరొక రకం టాబ్లెట్ పై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి టాబ్లెట్స్ ఏమీ లేకుండా వీటిపై ఆధారపడకుండా వెంటనే నొప్పి తగ్గించుకోవడానికి మనకు అందుబాటులో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు, కానీ కొంతమందికి ఏ పదార్థం దొరకకపోయినా ఇంట్లో కొన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అవి ఏమిటంటే సున్నము, మనకు సున్నము డబ్బా మామూలుగా మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు, దీన్ని చాలామంది తాంబూలంలో వేసుకోవడానికి వాడుతారు, ఒకప్పుడు ఇళ్ళకి సున్నపు పూత వేసేవారు గోడలకి కానీ ఇప్పుడు అవకాశం లేదు పెయింటింగ్స్ వచ్చేసాయి కాబట్టి సున్నం దొరకడం కష్టమవుతుంది.

కానీ మనకు ఉన్న అదృష్టం ఏమిటంటే తాంబూలం నమిలే అలవాటు వల్ల మళ్ళీ మనకు డబ్బా రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక మంచి ద్రవ్యం. ఎవరికైనా ఎక్కడైనా నొప్పులు వస్తున్నాయంటే ఆ చిన్నపాటి నొప్పులకు కొంతమందికి మోకాళ్ళలోనూ, మెడ దగ్గర, నడుము దగ్గర మామూలుగా నొప్పి వస్తుంది, అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియదు.కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిందని క్యాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు దానికంటే మీరు ఈ యొక్క సున్నాన్ని తమలపాకులో పెట్టి నమిలి తింటుంటే మీకు పోక చెక్కలు కానీ వక్కలు గానే వాడకుండా లవంగం యాలక్కాయలు లేదా దాల్చిన చెక్క ఏదైనా ఒకటి వేసుకుని మీరు నమ్మితే కనుక కొంత నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పై పూతలాగా ప్యాక్ లాగా వేసుకోవడం. ఒకవేళ మీకు దెబ్బ తగిలితే నొప్పి వస్తుంటుంది కదా ఆ సమయంలో సున్నము మరియు కొన్ని ఇతర ద్రవ్యాలతో ప్యాక్ చేసుకొని వేసుకున్నట్లయితే మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.

అంటే మొదటగా ఒక చిన్న రోలు తీసుకొని అందులో సున్నాన్ని ఒక స్పూన్ వేసుకుంటే తేనె కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ సున్నం అనేది మీ సమస్యను బట్టి మీరు వేసుకోవాలి , సున్నాన్ని మెత్తగా నూరుకోవాలి, ఇలా మెత్తగా చేసిన తర్వాత తేనెను యాడ్ చేసుకోవాలి, తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసుకుని దానిలో ఉండే గింజలను తీసివేసి రసాన్ని పిండుకోవాలి, మళ్లీ ఒకసారి మెత్తగా మర్దన చేసినట్లుగా నూరుకోవాలి, ఇప్పుడు దీన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి, దీన్ని మీరు ఎక్కడైనా నొప్పులు ఉంటే నడుము నొప్పులు కాని మోకాళ్ళ నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ ఎక్కడైనా సరే లేదంటే కింద పడితే దెబ్బలు తగిలిన తర్వాత ఎక్కడైనా సరే నొప్పి ఉంటే ఈ సున్నపు, తేనె ,నిమ్మకాయ మిశ్రమాన్ని ఆ నొప్పి ఉన్న ప్రదేశంలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక గుడ్డతో కట్టి వేసుకోవాలి, ఇలా పడుకునే ముందు చేసినట్లయితే అది సున్నం మిశ్రమం ఎండిపోయి చెయ్యికి పట్టేస్తుంది, మరుసటి రోజు ఉదయం వరకు మీకు పెయిన్ అంతా తగ్గిపోతుంది. ఇలా చిన్నచిన్న సమస్యలకు మీరు మందులను వాడకుండా ఇలాంటివి తయారు చేసుకుని మంచి ఫలితాన్ని పొందవచ్చు.