1 నెలలో 20 కేజీలు వెయిట్ లాస్ !! అసలు సీక్రెట్ ఇదే 

బరువు తగ్గక చాలామంది బాధపడుతూ ఉంటారు ఏం తిన్నా ఏం చేసినా తగ్గడం లేదు ఎప్పుడు చూసినా నేను ఇంతే అని నిరుత్సాహపడుతూ ఉంటారు ఇలాంటి వారు ఎక్కువ మంది ఉంటే మరి కొంత మంది నేను ఎక్కువగా తగ్గిపోతున్నాను. అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి అడ్మిట్ అవుతారు బరువు తగ్గడానికి చాలామంది నియమాలు ఇంట్లో కూడా ఆచరిస్తారు, ఒక నెలలోనే ఐదు కేజీలు 8 కేజీలు 10 కేజీల వరకు కూడా ఇంట్లోనే బరువు తగ్గుతారు కొంతమంది. ఇప్పుడు మనం చెప్పే నియమాలు ఇంట్లో ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గుతూ ఉంటారు, కానీ వీళ్లు ఎక్కువగా తగ్గిపోతున్నారు అని కంగారు పడిపోతూ ఉంటారు. అంటే వెయిట్ లాస్ స్పీడ్ గా జరిగితే ఏమైనా నష్టం జరుగుతుందా, ఏమైనా ప్రమాదమా అనే విషయాలను ఆలోచిస్తే, కొన్ని తప్పులను చేస్తూ వెయిట్ తగ్గే విషయాలలో వెయిట్ లాస్ స్పీడ్ గా జరగడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉండవచ్చు.

అవి కొన్ని చోట్ల ఎప్పుడైనా టీవీలలో చూపిస్తూ ఉంటారు ఈ టీ తాగండి వెయిట్ తగ్గిపోతారు అంటే టి తాగడం వల్ల ఆకలి చచ్చిపోతుంది. కొన్ని పౌడర్లు ఇస్తారు. అందులో రకరకాల కెమికల్స్ ని ఆకలి చంపేసే వాటిని కలుపుతారు. అలాంటి వాటిని తీసుకుని డైటింగ్ చేసి ఒక నెలలో 7 8 కేజీలు 10 కేజీలు లాస్ అయ్యారు అనుకోండి నష్టం జరుగుతుంది. ఎందుకంటే పోషకాలు వెళ్లడం లేదు, విటమిన్స్ మినరల్స్ వెళ్లడం లేదు, ప్రోటీన్ వెళ్లడం లేదు, అంటే బాడీకి న్యూట్రిషన్స్ ఏమీ కూడా అందడం లేదు, అలాగే వ్యాయామాలు కూడా ఏమి చేయడం లేదు కానీ వెయిట్ లాస్ అవుతున్నారు.దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి బ్లడ్ డ్యామేజ్ అవుతుంది, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఇలాంటివి అనేకం జరుగుతూ మీరు వెయిట్ లాస్ అవుతున్నారు కాబట్టి నష్టం జరుగుతుంది.

మరి కొంతమంది వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు మంచిగా ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు దీనివల్ల స్పీడ్ గా వెయిట్ లాస్ అయినా కూడా నష్టం అసలు ఉండదు. ఉదాహరణకి జ్యూస్ ఫాస్టింగ్ మీలో చాలామంది చేస్తూ ఉంటారు, ఒక 30, 40 రోజుల వరకు జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు దీనిని రోజుకు ఐదు సార్లు తీసుకుంటారు. ఇలా ఫైవ్ టైమ్స్ జ్యూస్ లు తాగడం వల్ల మీకు విటమిన్స్ మినరల్స్ అందుతాయి. మినిమం కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి ,ప్రోటీన్ ఫ్యాట్, వెళ్ళవు. ఒక నలభై రోజులు ప్రోటీన్ ఫ్యాట్ వెళ్లనందువల్ల నష్టం ఏమి జరగదు అసలు సమస్యలు ఏమి కూడా రావు కానీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బాడీ డీటాక్సీపికేషన్ జరుగుతుంది, ఫాట్ బర్నింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గుతారు కొంతమంది 30 40 రోజుల్లో టెన్ కేజీ తగ్గుతారు 100 కేజీలకు పైగా ఉన్నవారు ఇలా చేయడం వల్ల ఏమీ అవ్వదు.

ఇంకా మీరు హెల్తీగా ఉంటారు ప్రకృతి ప్రసాదించిన జ్యూస్ లలో తేనె వేసుకుని తాగితే వచ్చే నష్టం ఏమీ లేదు కొంతమంది ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తారు, జ్యూస్ తర్వాత కూడా మరొక 20 రోజులు 30 రోజులు ఫ్రూట్స్ తింటూ ఉంటారు. అందుకని ఫ్రూట్స్ డైట్ కూడా హెల్తీ డైట్, దీన్ని రోజులు మూడు పూటలు తీసుకోవచ్చు. ఇలా కాకుండా కొంతమంది రా ఫుడ్ తింటారు మార్నింగ్ 10 కి జ్యూస్ తాగి 11 కి స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తింటారు, ఈవినింగ్ ఫోర్ కి జ్యూస్ తాగి ఫైవ్ టు సిక్స్ ,స్వీట్ కార్న్, సలాడ్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్ తినేస్తారు. ఇలా రెండుసార్లు తినడం వల్ల బరువు బాగా తగ్గుతారు, 120- 130 ఉన్నవారు టూ టైమ్స్ తినడం వల్ల 13 -14 కేజీలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ డైట్ వల్ల మన బాడీలోకి అన్ని పోషకాలు కూడా వెళ్తాయి అందువలన భయపడాల్సిన అవసరం లేదు.