99% మంది చేసే బిగ్ మిస్టేక్ ఇదే….

మన డే హ్యాపీగా సాగాలి అంటే, రాత్రి మంచి నిద్ర ఉండాలి కానీ, ఈ మధ్యకాలంలో మంచి నిద్ర మహాభాగ్యం అయిపోయింది. అసలు దీనికి కారణం ఏమిటి? ఏ అలవాట్లను మనం మార్చుకోవాలి, ఏ అలవాట్లను మనం నేర్చుకోవాలి వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. నిద్రలేమికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి, ఏంటంటే ఇప్పుడు సమస్యలు పెరిగిపోతున్నాయి, మానసికంగా, శారీరకంగా సమస్యలు పెరుగుదల గ్రాఫ్ అనేది రోజురోజుకి పైకి వెళ్ళిపోతూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే లైఫ్ స్టైల్ బాగా లేకపోవడం, లైఫ్ స్టైల్ అంటే అది మనం చేసే పని కానీ, స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోవడం.

అంటే స్ట్రెస్ చాలా విధాలుగా ఉంటుంది, వర్క్ స్ట్రెస్ కావచ్చు, స్టడీస్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ ఉండవచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండవచ్చు, ఇవన్నీ ఫిజికల్ హెల్త్ మీద చూపిస్తున్నాయి. ఇవన్నీ నిద్రలేమికి కారణాలు. మంచి నిద్ర కావాలంటే ఖచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి. ఫిజికల్ వర్క్ బాగా చేయాలి, అందుకే ఊర్లలో ఉండే వాళ్లకి నిద్ర ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి. వాళ్లకి ఎందుకు రావు అంటే వాళ్ళు పొద్దున లేసి పొలాల్లో పనిచేస్తారు, లేదంటే పశువుల పెంపకం, లేదంటే ఏదో ఒక ఆక్టివిటీ ఫిజికల్ శ్రమ ఉంటుంది. మన దగ్గర గేమ్స్ కూడా ఆడరు ఫోన్లలో ఆడుతారు. శరీరం అలసిపోవడం లేదు ఇది పెద్ద రీసన్.

నైటు ఎలాంటి ఫుడ్డు తీసుకోవాలి అంటే, నైటు లైట్ ఫుడ్ తీసుకోవాలి, పొట్ట ఖాళీగా ఉంటేనే బెటర్, రాత్రి టైంలో అప్పుడు నిద్ర బాగా వస్తుంది. పడుకోవడానికి మూడు గంటల ముందే భోజనం చేస్తే, అదే చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. చాలామందికి ఉన్న బాడ్ హ్యాబిట్ ఏంటంటే, తినగానే పడుకుంటారు. అలాంటప్పుడు డైజేషన్ కూడా ప్రాపర్ గా ఉండదు, చాలామంది హైదరాబాద్లో బిర్యానీలు తినేస్తారు, రాత్రి 12 గంటలకి, రెండు గంటలకి బిర్యానీలు తినేసి పడుకుంటారు. దానివల్ల డెఫినెట్గా లైఫ్ లో ఇష్యూస్ వస్తాయి. ఫిజికల్ ఇష్యూస్ వస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.