Best Recipe : ఇడ్లీ పాత్ర తోమాల్సిన పనిలేదు.. మెత్తటి ఇడ్లీ ఇలా చేసుకోవచ్చు..

Best Recipe : ఆరోగ్యకరమైన అల్పాహారాలలో ఇడ్లీ కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మెత్తటి మృదువైన ఇడ్లీలు నెయ్యి, కారంపొడి నంచుకుని తింటే.. ఆ రుచే వేరు.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇడ్లీ పాత్రతో పాటు చాలా అంట్లు వస్తాయి అనేది నేటి మహిళల సమస్య.. ఇడ్లీ తినాలని ఉందా కానీ ఇడ్లీ పాత్ర కడిగే పని కూడా లేకుండా ఈ సింపుల్ టెక్నిక్ తో ఇడ్లీలు వండుకొని ఎంచక్కా తినేసేయండి.. సిప్పిలు వీటి గురించి పల్లెటూరు వారికి బాగా తెలుస్తుంది. తాటాకు పుల్లలతో వీటిని అల్లుతారు. చిన్న సిప్పీలు..

అదే తాటాకు చిన్న బట్టలు వీటిని తీసుకుని ఇడ్లీ అయికుడుం లాగా వేసుకుని తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పైగా శ్రమ కూడా తక్కువ. ముందుగా సిప్పిలను తీసుకొని వాటిపైన తడి క్లాత్ వేసుకోవాలి. అది కూడా కాటన్ తెల్లని క్లాత్ అయితే ఇంకా చాలా మంచిది. సిప్పిల పైన తడి బట్ట వేసుకొని దానిపైన ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని పెట్టాలి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వీటిని తీసుకోవాలి.

ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో నీళ్లు పోసి అడుగున ఒక చిన్న స్టాండ్ వేసి దానిపైన సిప్పి పెట్టీ దాని పైన మరి స్టాండ్ పెట్టీ మరో శిప్పి పెట్టాలి వీడియో లో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ ఇడ్లీని 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మరో ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ ఇడ్లీలు మెత్తగా మృదువుగా ఉండటంతో పాటు నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. ఇడ్లీలను మీకు నచ్చిన అల్లం, పల్లీల చట్నీ తో పాటు నెయ్యి కారప్పొడితో కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.