joint pain,నడుం నొప్పి,ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే టిప్

ప్రస్తుత తరుణంలో చాలా మంది నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు.. వంటి వివిధ రకాల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీటిని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నొప్పులు తగ్గక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఎలాంటి నొప్పిని అయినా సరే తగ్గించి ఎముకలను దృఢంగా మార్చే ఒక చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 20 ఎంఎల్‌ మోతాదులో ఆవ నూనె వేసి వేడి చేయాలి.

అందులో 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని ఇంకా చిన్నగా కట్‌ చేసి అందులో వేయాలి. ఇప్పుడు 10 లేదా 15 మిరియాలను కూడా అందులో వేయాలి. అనంతరం స్టవ్‌ను మధ్యస్థపై మంటపై ఉంచాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని 7 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. దీంతో ఆయిల్‌ తయారవుతుంది. తరువాత స్టఫ్‌ ఆఫ్‌ చేసి ఆయిల్‌ను వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఆయిల్‌ను పక్కన ఉంచి చల్లారే వరకు ఆగాలి. అనంతరం ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ చేయాలి. దీన్ని రోజూ నొప్పులకు ఉపయోగించవచ్చు.

మీ శరీరంలో నొప్పులు ఉన్న చోట ఈ ఆయిల్‌ను కొద్దిగా రాసి సున్నితంగా 15 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో ఎలాంటి నొప్పి అయినా సరే తగ్గుతుంది. ఈ ఆయిల్‌ను వాడడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీని వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు.. పైన తెలిపిన నొప్పులు ఉన్నవారు ఈ ఆయిల్‌ను రోజూ వాడుతుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది. దీన్ని నెల రోజుల పాటు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. ఆయిల్‌ అయిపోగానే మళ్లీ ఇలాగే తయారు చేసుకుని వాడవచ్చు.