Tablet Scoring Lines : సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. ఆ సమస్యకు తగిన టాబ్లెట్ ని వాడుతూ ఉంటాం. కొందరు టాబ్లెట్స్ వాడని వాళ్ళ ఇంట్లోనే కషాయం తయారు చేసుకుని తాగుతుంటారు. అయితే, ఇక్కడ మీరు తీసుకునే టాబ్లెట్స్ ని ఎప్పుడైనా గమనించారా..? మాత్రలపైన అడ్డంగా గీతలు ఉంటాయి. మీరు కూడా గమనించే ఉంటారు, టాబ్లెట్స్ మధ్యలో లైన్స్ ఉండడాన్ని. టాబ్లెట్స్ పైన గీతలు ఉండడానికి గల కారణాలు ఏమిటో తెలుసా..చాలామంది జ్వరం కానీ, తలనొప్పి ఇటువంటి సాధారణ సమస్యలకు ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. మీరు ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా… ఈ మాత్రలకు మధ్యలో అడ్డగీతలు ఉంటాయి.

టాబ్లెట్లకి ఇలా గీతలు ఉండడానికి గల కారణాలు, ఇలా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం… ఒక మనిషికి ఒక నిర్దిష్ట ఔషధాన్ని సూచించేటప్పుడు వైద్యులు వారికి మోతాదునుగా మందుని ఇస్తారు. మందులన్నిటిలో ఒక మధ్య గీత ఉంటుంది. తర్వాత ఆరోగ్యం ఆ మందులను తీసుకునేటప్పుడు దానిని ఏ సగానికి సులభంగా విరగ్గొట్టవచ్చు. ఇంకా కచ్చితంగా ఈ గీత లో ఉన్న టాబ్లెట్స్ గురించి చెప్పాలంటే… వైద్యులు ఉదయం సగం మందిని, యాహనం సగం మందిని తీసుకోవాలని చెప్పడం మనం చాలా సార్లు గమనించాం.దానికి ఇలా లైన్స్ ఉన్న టాబ్లెట్స్ రెండు భాగాలుగా విభజించడానికి ఉపయోగపడుతుంది.
మరి అన్ని టాబ్లెట్స్ పై ఇటువంటి అడ్డగీతలు ఉండవు. ఎందుకు గల ప్రధాన కారణం ఏమిటంటే, గుర్తులేని మందులు విభజించడానికి వీలు లేదు. వీటిని కచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే. గీతలు లేకుండా ఉన్న మాత్రలను రెండుగా విభజించాలంటే చాలా కష్టం, అంతే కాదు ప్రమాదకరం. క్షుణ్ణంగా చెప్పాలంటే ఒక నిద్రమాత్ర పవర్ 5 అనుకుందామ్… దానిపై అడ్డగీత ఉంటే దానిని విభజించడం ద్వారా దాని పవర్ సగానికి తగ్గించవచ్చు. టాబ్లెట్ మీద పవర్ 5 అని రాసి ఉండి, అడ్డగీత లేకపోతే.. దానిని మొత్తం తీసుకోవడం మంచిది. ఆ రోగికి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ రకమైన మందులను సూచిస్తారంట.