Woman Stomach : ఈ మధ్య కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చాలా పెరిగింది. మనం ఆసుపత్రులకి లక్షలకి లక్షలు ఖర్చు పెట్టిన కూడా కొందరు వైద్యులు సరైన వైద్యం చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో 2008, ఫిబ్రవరి 28న ‘షీ మెడికల్ కేర్’ నర్సింగ్ హోమ్‌లోచేరగా,అప్పుడు ఆమెకి వైద్యులు సి సెక్షన్ ఆపరేషన్ చేశారు.

Woman Stomach ఇంత నిర్లక్ష్యమా ?
అయితే ఆ సమయంలో కత్తెరని కడుపులోనే మరిచిపోవడంతో 17 ఏళ్లుగా కత్తెర ఆమె కడుపులో అలానే ఉంది. దాని వలన సదరు మహిళ నిరంతరం కడుపునొప్పితో బాధపడుతూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్న ఆమె కడుపునొప్పి పెరుగుతూనే ఉండడంతో.. ఇటీవల స్థానిక కేజీఎంయూ ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేయగా.. అసలు విషయం బయటపడింది.
ఎక్స్-రేలో ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైద్యులు సదరు మహిళకు మార్చి 26న ఆపరేషన్ నిర్వహించి.. కత్తెరను విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై సంధ్యా పాండే భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు 17 ఏళ్ల క్రితం సిజేరియన్ చేసింది డాక్టర్ పుష్ప జైస్వాల్ అని.. దీనికి ఆమె పూర్తి బాధ్యత వహించాలని, దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులని కోరాడు